- Telugu News Photo Gallery Cricket photos Jadeja Excluded from ODI Squad After Man of the Match: Strategic Move or Form?
ఇక ఈ సీనియర్‌కి రిటైర్మెంట్ తప్ప వేరే దారి లేదా? వన్డే జట్టులో చోటు కష్టమేనా?
వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన రవీంద్ర జడేజాను భారత వన్డే జట్టు నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. అద్భుత ప్రదర్శన తర్వాత కూడా అతన్ని తీసివేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇది వ్యూహాత్మక నిర్ణయం అని, జడేజా ఫామ్ కారణం కాదని స్పష్టం చేశారు.
Updated on: Oct 04, 2025 | 11:02 PM

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బాల్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు బీసీసీఐ భారీ షాకిచ్చింది. అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన రవీంద్ర జడేజాను భారత వన్డే జట్టు నుంచి తప్పించారు.

అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా అజేయంగా 104 పరుగులు చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో కేవలం 54 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా వెస్టిండీస్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

అద్భుతమైన ప్రదర్శనకు గాను రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీం ఇండియా వన్డే జట్టులో జడేజాకు చోటు దక్కలేదు. చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన జడేజాకు ఇదే చివరి వన్డే ప్రదర్శన అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చివరిసారిగా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన జడేజా బ్యాటింగ్‌లో అజేయంగా 9 పరుగులు చేశాడు. చివరకు టీమ్ ఇండియా న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

ఈ టోర్నమెంట్‌లో రవీంద్ర జడేజా ప్రదర్శన దారుణంగా ఉంది. అతను 5 మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు, బ్యాటింగ్‌తో 27 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే సెలెక్టర్లు జడేజాను వన్డే జట్టులో చేర్చలేదు, కానీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వేరే కారణం చెప్పాడు. జట్టు ప్రకటన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. జడేజాకు విశ్రాంతి ఇవ్వడం అతని సామర్థ్యం లేదా ఫామ్ వల్ల కాదని, వ్యూహాత్మక నిర్ణయం అని అన్నారు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే జట్టులో ఉన్నందున ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.




