- Telugu News Photo Gallery Cricket photos IND vs NZ: Team India Captain Rohit Sharma out for duck, 1st time at home test match since 2015 against South Africa
IND vs NZ: 9 ఏళ్ల గాయం రిపీట్.. 2015 తర్వాత తొలిసారి ఇలా.. టీమిండియా కెప్టెన్‌కు ఏమైంది?
India vs New Zealand, 2nd Test: పూణె టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు టీమిండియాకు మిశ్రమంగా ఉంది. తొలుత భారత స్పిన్నర్లు న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 259 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా శుభారంభం అందించారు. అయితే, ఆ తర్వాత భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ జీరోకే పెవిలియన్ చేరాడు.
Updated on: Oct 25, 2024 | 9:13 AM

India vs New Zealand, 2nd Test: భారత్-న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ కేవలం 259 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశారు. (ఫోటో: AFP)

అయితే, భారత జట్టుకు కూడా బిగ్ షాక్ తగిలింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి, భారత జట్టు 16 పరుగులు మాత్రమే చేసింది. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కూడా కోల్పోయింది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ నాటౌట్‌గా వెనుదిరిగారు. (ఫోటో: PTI)

వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ తమ ఆటతీరుతో కెప్టెన్ రోహిత్ శర్మను సంతోషపరిచారు. అతని నిర్ణయం సరైనదని నిరూపించారు. కానీ, రోహిత్ మాత్రం ఏమీ చేయలేకపోవడంతో 9 ఏళ్ల గాయం మళ్లీ తాజాగా మారింది. (ఫోటో: PTI)

ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే న్యూజిలాండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ బౌలింగ్‌లో రోహిత్ అవుటయ్యాడు. రోహిత్ 9 బంతులు ఎదుర్కొన్నాడు. అయితే, ఈ సమయంలో అతను ఖాతా తెరవడంలో విఫలమై 0 పరుగుల వద్ద ఔటయ్యాడు. (ఫోటో: PTI)

దీంతో 9 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ జీరో పరుగులకే అవుటయ్యాడు. అంతకుముందు 2015లో దక్షిణాఫ్రికాపై న్యూ ఢిల్లీ టెస్టులో 0 వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత అతను ప్రస్తుతం టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్న పేసర్ మోర్నీ మోర్కెల్ చేతిలో ఔటయ్యాడు. (ఫోటో: PTI)




