- Telugu News Photo Gallery Cricket photos DC vs KKR: Delhi Capitals spin bowler Kuldeep Yadav again picks 4 wickets against KKR in IPL 2022
IPL 2022: వద్దన్న జట్టుపైనే విధ్వంసం.. రెండోసారి 4 వికెట్లు తీసి కోల్‌కతాను బోల్తా కొట్టించిన బౌలర్..
కోల్‌కతా నైట్ రైడర్స్ గత సీజన్‌లో ఈ ఆటగాడిని బెంచ్‌పై కూర్చోబెట్టింది. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వకుండా పక్కనపెట్టింది.
Updated on: Apr 29, 2022 | 7:07 AM

ఐపీఎల్‌లోని అనేక అద్భుతమైన క్షణాలు ఉన్నాయి. అంతులో ఒక ఆటగాడు తన పాత జట్టుకు వ్యతిరేకంగా మైదానంలోకి దిగి, ఆపై బాగా రాణించటం ఎంతో ప్రాముఖ్యతను దక్కించుకుంటుంది. ముఖ్యంగా గత జట్టులో కొందరికి పెద్దగా అవకాశాలు రాలేదు. లేదా నిలకడగా రాణిస్తున్నప్పటికీ వారిని రిటైన్ చేయలేదు. ఐపీఎల్ 2022లో కూడా దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేసిన కుల్దీప్ యాదవ్, అదే జట్టుపై మైదానంలో విధ్వంసం సృష్టించడం చాలా ప్రత్యేకంగా నిలిచింది.

చాలా కాలం పాటు కేకేఆర్‌లో భాగమైన కుల్‌దీప్‌కు గత 3 సీజన్లలో పేలవమైన ఫామ్ కారణంగా పెద్దగా అవకాశాలు రాలేదు. 2021లో, అతను మొత్తం సీజన్‌లో బెంచ్‌లోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు వచ్చిన వెంటనే, కుల్దీప్ గత 2-3 సీజన్లలో వైఫల్యం నుంచి కోలుకుని తన పాత స్టైల్‌ను ప్రదర్శించడం ప్రారంభించాడు. ముఖ్యంగా కోల్ కతాపై కుల్దీప్ భిన్నమైన ఫామ్ కనబరిచాడు.

ఏప్రిల్ 28, గురువారం వాంఖడే స్టేడియంలో KKRతో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ కేవలం 3 ఓవర్ల బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ కేవలం 14 పరుగులకే ఇచ్చి శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, బాబా ఇంద్రజిత్ వికెట్లు పడగొట్టాడు. విశేషమేమిటంటే కుల్దీప్ వరుస బంతుల్లో ఇంద్రజిత్, నరైన్‌ల వికెట్లు పడగొట్టగా, తన మూడో ఓవర్‌లో మొదట అయ్యర్, ఆ తర్వాత రస్సెల్‌ను డీల్ చేశారు.

హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, ఈ సీజన్‌లో ఢిల్లీ, కోల్‌కతా జట్ల మధ్య ఇది రెండో పోరు కాగా, రెండు సార్లు కుల్దీప్ స్పిన్ మ్యాజిక్ పని చేసింది. అంతకుముందు ఏప్రిల్ 10న బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతను ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లలో 17 వికెట్లు పడగొట్టాడు. అతని సన్నిహితుడు యుజ్వేంద్ర చాహల్ (18) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రేసులో రెండవ స్థానంలో ఉన్నాడు.




