AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam District: కొనిజర్లలో కంటైనర్ ఇల్లు – చాలా తక్కువ ఖర్చు – ఫోటోస్ చూసేయండి

ప్రతి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించకోవడం ఓ కల. అయితే ప్రస్తుత భవన నిర్మాణ ఖర్చులు పేద, మధ్యతరగతివారికి భారంగా మారాయి. మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య కుటుంబాలు ఆలోచన మార్చుకుని కంటైనర్ ఇళ్ల వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఇంటిని మీకు పరిచయం చేయబోతున్నాం..

N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 27, 2025 | 10:59 AM

Share
 ఖమ్మం జిల్లా కొనిజర్లలోని చింతల సతీష్ తనకున్న చిన్న స్థలంలో కంటైనర్ ఇల్లు నిర్మించి స్థానికులను ఆకర్షిస్తున్నాడు. సుమారు 300 చదరపు అడుగుల స్థలంలో బేస్‌మెంట్ నిర్మించి, దానిపై ప్రీ-ఫ్యాబ్రికేట్ కంటైనర్ ఇల్లు ఫిట్ చేయించారు.

1 / 6
ఈ ఇల్లు కిచెన్, హాల్, సింగిల్ బెడ్ రూమ్, అటాచ్డ్ బాత్‌రూమ్ వంటివన్నీ కలిగి ఉండేలా ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్‌తో తయారుచేశారు. సతీష్ ఈ ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఖర్చు పెట్టగా.. జీఎస్జీ, రవాణా కలిపి అదనంగా రూ.లక్ష వెచ్చించాడు.

2 / 6
ఇల్లు-- వాటర్, హీట్, ఫైర్ ప్రూఫ్‌గా ఉండి.. ఐదేళ్ల వారంటీతో అందించారు. 15 లక్షల రూపాయలతో సాధారణ భవనం నిర్మాణానికి సంవత్సరకాలం పట్టే చోట.. ఈ కంటైనర్ ఇల్లు నెల రోజుల్లోనే పూర్తయింది.

3 / 6
ఈ ఇల్లు హైదరాబాద్ దూలపల్లిలోని తయారీ కేంద్రం ద్వారా రెడీ చేశారు. అక్కడ కంటైనర్ ఇళ్లను వివిధ కొలతల్లో తయారు చేయిస్తారు. సింగిల్ బెడ్‌రూమ్, డబుల్ బెడ్‌రూమ్ వేరియంట్లతో పాటు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఈ ఇళ్లను రూపొందించుకోవచ్చు.

4 / 6
కంటైనర్ ఇళ్ల నిర్మాణానికి తక్కువ వ్యయం, వేగవంతమైన ప్రాసెస్ కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా ఈ ఇళ్ల గురించి తెలుసుకొని..  కాంట్రాక్ట్ చేసే వారు పెరుగుతున్నారు.

5 / 6
 సాధారణ ఇళ్ల నిర్మాణానికి ఉన్నట్లే అన్ని వెసులుబాట్లు ఉండటం... పెద్ద మొత్తంలో డబ్బు ఆదా ఉండటంతో రానున్న రోజుల్లో కంటైనర్ గృహాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.  తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలున్న ఇల్లు నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ ఇంటి యజమాని చెబుతున్నారు.

6 / 6