Currency Collection: దేశ, విదేశాల కరెన్సీ.. 33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..

| Edited By: Shaik Madar Saheb

Dec 28, 2024 | 10:10 PM

నేటికి కరెన్సీ సేకరణ ముమ్మరంగా కొనసాగుతుందని వినొద్ చెప్పారు.. భారత దేశ చరిత్రలో కరెన్సీ చలామణిలో అతి తక్కువ విలువ కలిగి పేరుగాంచిన బొట్టు, అణాతో పాటు దమ్మిడి, పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ,పది పైసల నుంచి 1000 కాయిన్ వరకు నాణేలు సేకరించినట్లు తెలిపారు..

1 / 7
కరెన్సీ సేకరణ ఆయన హాబి. అందుకే ఆయన అందరికంటే భిన్నంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.. కర్నూలు ఆత్మకూరు పట్టణానికి చెందిన దేవరశెట్టి వినోద్ కుమార్ అనే వ్యక్తి విభిన్నంగా ఆలోచించి కరెన్సీని 33 సంవత్సరాలుగా సేకరిస్తున్నాడు. అతని వద్ద అరుదైన నాణేలు, నోట్లు ఉన్నట్లు వినోద్ కుమార్ తెలియజేశారు. రాజుల కాలం నాటి పురాణ నాణాలు కూడా ఉన్నట్లు వినోద్ కుమార్ తెలియజేశారు. ఆత్మకూరు పట్టణం నేతాజీ నగర్ లో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న దేవరశెట్టి వినోద్ కుమార్ తనకున్న హాబీ నోట్ల కరెన్సీ సేకరణతో 33 సంవత్సరాలుగా వివిధ దేశాల నోట్లను రాజుల కాలం నాటి పురాతన నాణేలను సేకరిస్తూ వస్తున్నారు.

2 / 7
బంధువులు కుటుంబ సభ్యుల సహకారం వల్ల ఈ అరుదైన కరెన్సీ సేకరణ చేశానని వినోద్ తెలిపారు.. అంతేకాకుండా హంపి ధర్మస్థల మైసూరు తంజావూర్ తదితర పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ లభించే, అరుదైన కరెన్సీ కొనుగోలు చేసి మరి దాచుకుంటున్నానని చెప్పారు.. 1992 సంవత్సరంలో కర్నూలులో ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల పదవ తరగతి చదువుతున్న సమయంలో ఆయన గురువు సాంబశివరావు చెప్పారని.. అప్పటినుంచి కరెన్సీ సేకరణ ప్రారంభించానని తెలియజేశారు.

3 / 7
నేటికి కరెన్సీ సేకరణ ముమ్మరంగా కొనసాగుతుందని వినొద్ చెప్పారు.. భారత దేశ చరిత్రలో కరెన్సీ చలామణిలో అతి తక్కువ విలువ కలిగి పేరుగాంచిన బొట్టు, అణాతో పాటు దమ్మిడి, పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ,పది పైసల నుంచి 1000 కాయిన్ వరకు నాణేలు సేకరించారు. అలాగే ఆయా సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు నుంచి విడుదలైన ప్రతి కాయిన్ ను నోటును పోగు చేశారు. భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విడుదల చేసిన కరెన్సీ నిజాం పాలనలలో కరెన్సీ పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రతి కరెన్సీని తన వద్ద పదిలంగా భద్రపరుచుకున్నానని వినోద్ కుమార్ తెలియజేశారు.

4 / 7
వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశ విదేశాలకు చెందిన అరుదైన కరెన్సీ నానాలను సేకరించాలని, ఇండియాతో పాటు నేపాల్, శ్రీలంక, చైనా, జపాన్, సింగపూరు యుగస్లేవియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పిలిపిన్స్, యూరప్, లిబియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా కువైట్ దుబాయ్ అమెరికా, ఇంగ్లాండ్ ,కెనడా, ఉత్తరకొరియా, జర్మనీ, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, భూటాన్, జింబాబ్వే, తదితర దేశాలకు చెందిన కరెన్సీ నాణేలను నోట్లను సేకరించానని తెలిపారు.

5 / 7
అంతేకాకుండా భారత దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రారంభానికి ముందు కొనసాగిన కరెన్సీ తోపాటు తర్వాత వచ్చిన కరెన్సీని కూడా సేకరించానని, అలాగే నిజాం నవాబు కాలంనాటి అరుదైన ముద్రిత నాణేలను కూడా సేకరించానని పలు కరెన్సీ నాణేలు నోట్ల కోసం లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశానని చెప్పారు.

6 / 7
కరెన్సీ సేకరణకు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ.. దీనికి కుటుంబ సభ్యుల సహకారం కూడా అందుతుందని వినోద్ కుమార్ తెలియజేశారు. దేశ విదేశాల్లో ఉన్న పురాతన కరెన్సీ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్నది తన లక్ష్యమని.. ఇందుకోసం 33 ఏళ్లుగా కష్టపడుతున్నానన్నారు..

7 / 7
ఇంకా అనేక విదేశీ కరెన్సీ సేకరించాల్సి ఉందని, సాధ్యమైనంత వరకు వాటిని సేకరిస్తానన్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సేకరించిన కరెన్సీ నాణేలు నోట్ల ప్రదర్శన ఉంచి కరెన్సీని చరిత్ర ప్రజలకు తేలియజెప్పాలన్నదే తన సంకల్పం అని వినోద్ కుమార్ అన్నారు.