Coconut Water: కొబ్బరి నీళ్లతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా రెట్టింపు! ఎలా వాడాలంటే..

Updated on: Mar 05, 2025 | 8:19 PM

ముఖం మీద అధిక వయసు వల్ల ఏర్పడే మచ్చలు, మొటిమల మచ్చలు ఉంటే కొబ్బరి నీళ్లను దూదిని ముంచి ముఖానికి అప్లే చేయాలి. ఇలా ఒక నెల పాటు చేస్తే మచ్చలు పూర్తిగా మాయమవుతాయి, వయసు కూడా చాలా తగ్గినట్లు కనిపిస్తారు. జుట్టు పొడిబారడం నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా కొబ్బరి..

1 / 5
చాలా మంది జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు. జుట్టు పొడిబారడం నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను రాసుకుంటూ ఉంటారు. అయితే కొబ్బరి నూనెలోనే కాదు కొబ్బరి నీటిలో కూడా ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. ఇవి జుట్టు, చర్మం పోషణకు బలేగా పనిచేస్తాయట.

2 / 5
పొటాషియం అధికంగా ఉండటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీటి నిలుపుదలకు కారణమయ్యే సోడియం ప్రభావం సమతుల్యమవుతుంది. ద్రవ సమతుల్యత ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. దీనితో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

3 / 5
కొబ్బరిలో ఉండే ఎలక్ట్రోలైట్లు ఆరోగ్యకరమైన జీవక్రియను కూడా అందిస్తాయి. ఇది బరువు తగ్గించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. అధిక కేలరీలు కలిగి ఉండే ఇతర పానీయాలకు బదులుగా కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల మొత్తం క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.

4 / 5
కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తరచుగా సహజ స్పోర్ట్స్ డ్రింక్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి శరీరానికి అందజేస్తుంది. బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.

5 / 5
కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటితో శరీరంలో కొవ్వు పేరుకుపోదు. కొబ్బరి నీళ్లు బరువు తగ్గించడమే కాకుండా ఉబ్బరం, శరీరం నీటిని నిలుపుకోవడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు తగ్గడంలో కొబ్బరి నీళ్లు ప్రభావవంతంగా పనిచేస్తాయిన పలువురు డైటిషీయన్లు సైతం చెబుతున్నారు. ఇందులో ఎలక్ట్రోలైట్ పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.