
జాంబి రెడ్డి - జీ5 ఓటీటీ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో తెరకెక్కిన మొదటి జాంబీ సినిమా ఇదే. ఇది జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

ట్రెయిన్ టు బూసాన్ - నెట్‌ఫ్లిక్స్ ఇది కొరియన్ హారర్ మూవీ. సియోల్ నుంచి బూసాన్ వెళ్తున్న రైల్లో జాంబీ అటాక్ నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు చేసే ప్రయత్నమే ఈ సినిమా. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులోనూ ఈ సినిమాను చూడొచ్చు.

జాంబీల్యాండ్ - నెట్‌ఫ్లిక్స్ ఊహించని వ్యాధి మనుషలందరినీ జాంబీలుగా మార్చడం, అయితే నలుగురు మాత్రం దీని నుంచి ఎలా తప్పించుకున్నారన్నదే ఈ సినిమా. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

మిరుతన్ - జీ5 ఓటీటీ కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇందులో హీరోగా నటించాడు. ఓ కుక్క ఓ సెక్యూరిటీ గార్డ్ ను కరవడంతో అతను జాంబీగా మారతాడు. అతని నుంచి సామాన్యులను కాపాడడమే ఈ సినిమా కథ.

గో గోవా గాన్ -ప్రైమ్ వీడియో బాలీవుడ్ లో తెరెక్కిన జాంబీ మూవీ ఇది. సైఫ్ అలీఖాన్ హీరోగా నటించాడు. గోవాలో ఓ పార్టీకి వెళ్లిన ముగ్గురు స్నేహితులు జాంబీల బారిన పడతారు. అక్కడి నుంచి వాళ్లు ఎలా తప్పించుకుంటారన్నదే ఈ సినిమా కథ.

ఇవి కూడా.. ఓ సీక్రెట్ ల్యాబ్ నుంచి వైరస్ మనుషులను జాంబీలుగా మార్చే క్రమంలో జరిగిన పరిణామాలే ఈ 28 డేస్ లేటర్ సినిమా నేపథ్యం. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇక జాంబీ జానర్ కే చెందిన వరల్డ్ వార్ జెడ్ కూడా ప్రైమ్ లో చూడొచ్చు.