Young Heroes: కొండెక్కిన హీరోలు.. భారీ బడ్జెట్‌లు అంటూ నిర్మాతలను డిమాండ్..

Edited By: Prudvi Battula

Updated on: Feb 21, 2024 | 1:08 PM

ఒక్క సినిమా హిట్ అవ్వగానే మన కుర్ర హీరోలకు వస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. 10 కోట్ల మార్కెట్ కూడా లేని హీరోలకు అనుకోకుండా బ్లాక్‌బస్టర్ పడగానే.. ఆ తర్వాత సినిమాకు భారీ బడ్జెట్‌లు పెట్టాలని గొంతెమ్మ కోర్కెలు కోరడం కామన్ అయిపోయింది. మరి తమ సినిమాల బడ్జెట్ విషయంలో అలా కొండెక్కి కూర్చుంటున్న హీరోలెవరో చూద్దామా..

1 / 5
టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది.. మరి మేమెందుకు ఇక్కడే ఉండాలి.. మేం కూడా పాన్ ఇండియన్ హీరోలమే అంటున్నారు కొందరు కుర్ర హీరోలు. వాళ్ల తీరు చూస్తుంటే నిర్మాతలకు నిద్ర పట్టట్లేదు.

2 / 5
ఎవరివరకో ఎందుకు.. తేజ సజ్జానే తీసుకుందాం..! హనుమాన్ 300 కోట్లు వసూలు చేయడంతో.. నెక్ట్స్ సినిమాకు కనీసం 40 కోట్లైనా పెట్టరా అని నిర్మాతల దగ్గర మొండికేస్తున్నారు ఈ హీరో.

3 / 5
చైల్ట్ ఆర్టిస్టుగా వచ్చిన తేజ.. ఓ బేబీ లాంటి సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. జాంబి రెడ్డి, హనుమాన్‌తో హీరోగా నిలబడ్డారు. అయితే హనుమాన్ పూర్తిగా ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అందులో తేజ ఉన్నా మార్కెట్ వర్కవుట్ అయింది ప్రశాంత్ వల్లే. ఇది హిట్టైంది కదా అని.. తేజ సజ్జా కొత్త సినిమాకు 40 కోట్లు బడ్జెట్ పెడితే నిర్మాతలకు కునుకు కష్టమే.

4 / 5
ఇదే శ్రీకాంత్ కొడుకు రోషన్ విషయంలోనూ జరుగుతుందని తెలుస్తుంది. పెళ్లి సందడి తర్వాత రోషన్ మరో సినిమా చేయలేదు. చేస్తే పాన్ ఇండియన్ ప్రాజెక్టే చేయాలని వెయిట్ చేస్తున్నారు ఈ హీరో. బడ్జెట్ విషయంలోనూ నో కాంప్రమైజ్ అంటున్నారు రోషన్.

5 / 5
అలాగే డిజె టిల్లు హీరో సిద్దూ జొన్నలగడ్డపై కూడా ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి. ముందు సినిమాలు హిట్టయ్యాయి కదా అని.. ఈ కుర్ర హీరోలపై భారీ బడ్జెట్ పెడితే రిస్క్ తీసుకునేది నిర్మాతలే అనేది విశ్లేషకుల వాదన.