Akhil Akkineni: కొత్త దర్శకుడితో మూవీని ప్లాన్ చేస్తున్న అఖిల్ అక్కినేని.
అఖిల్ నెక్ట్స్ మూవీ విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. కొత్త దర్శకుడితో నెక్ట్స్ మూవీని కన్ఫాన్మ్ చేశారు అక్కినేని ప్రిన్స్. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉంది. దీంతో అసలు అఖిల్ ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న డిస్కషన్ జరుగుతోంది. ఏజెంట్ సినిమాతో నిరాశపరిచిన అఖిల్ ఆ తరువాత డైలామాలో పడ్డారు. నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు ఎలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి, దర్శకుడిగా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న నిర్ణయం తీసుకోవడానికే చాలా టైమ్ తీసుకున్నారు.