
కేజీయఫ్ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు యష్. జస్ట్ అనుకోవడమే కాదు.. ఆల్రెడీ ఆచరణలోనే పెట్టేశారు. ఇప్పుడు టాక్సిక్ సినిమా ప్రోగ్రెస్‌ని జాగ్రత్తగా గమనించిన వారు ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ యష్ ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి?

కన్నడ హీరోల్లో యష్ అనే ఓ స్టార్ ఉన్నట్టు కేజీయఫ్‌కి ముందు ఎంత మందికి తెలుసు అంటే... ఇంతా అని చెప్పడం కష్టం.. కానీ ఆఫ్టర్ కేజీయఫ్ ప్యాన్ ఇండియా లెవల్లో యష్ పేరు తెలియని మూవీ లవర్ లేరంటే ఆశ్చర్యం కాదు.. అంతగా పాపులర్ అయింది యష్ అనే పేరు.

కేజీయఫ్ కాన్సెప్టులో రాకీభాయ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో... ఆయన తల్లి చెప్పిన మాటలకు, ఆ రోల్‌కి అంతకన్నా ఇంపార్టెన్స్ ఉంది. తనను ముందుకు నడిపింది అమ్మ మాటే అని నమ్మాడు రాకీభాయ్.

బంగారం మొత్తాన్ని సముద్రం మీదుగా తరలించింది కూడా తల్లి ఎప్పుడో చెప్పిన మాట ప్రకారమే.. కేజీయఫ్‌కి వెన్నుదన్నుగా నిలిచిన లేడీ సెంటిమెంట్‌ని టాక్సిక్‌లోనూ రిపీట్ చేస్తున్నారు యష్. పీరియాడిక్ సినిమాగా టాక్సిక్‌ని తెరకెక్కిస్తున్నారు గీతూ మోహన్‌దాస్.

కియారా హీరోయిన్‌గా నటిస్తున్నారు. నయన్ అండ్ హ్యూమా ఖురేషీ కీ రోల్స్ లో కనిపిస్తున్నారు. తన చుట్టూ ఇంత మహిళా శక్తితో ట్రావెల్ చేస్తున్నారు యష్. మరి కేజీయఫ్ ఇచ్చినంత సక్సెస్ టాక్సిక్ కూడా ఇస్తుందా?