Game Changer: ఆన్ టైమ్‌కు గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందా ?? సందిగ్ధం లో ఫ్యాన్స్
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే చూస్తుండగానే ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేళ్ళు దాటిపోయింది. గ్యాప్ ఇవ్వనని చెప్పిన చరణ్.. మళ్లీ భారీగానే గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఆచార్య వచ్చినా.. అది చిరంజీవి సినిమా.