
ఒకానొక సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ఈ అమ్మడికి టర్నింగ్ పాయింట్ అని చెప్పులి.

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ప్రియమణికి వరస ఆఫర్స్ క్యూ కట్టాయి.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది ప్రియమణి. అయితే రానురాను ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తోంది.

రీసెంట్ గా వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో నటించింది. అలాగే తాజాగా వచ్చిన షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ప్రియమణి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రియమణి కి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఓ స్టార్ హీరోకు ప్రియమణి తల్లిగా నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు తనతో కలిసి నటించిన ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు ప్రియమణి తల్లిగా నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దేవర సినిమాలో ప్రియమణి తారకు కు తల్లిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది.