- Telugu News Photo Gallery Cinema photos Will Pooja Hegde act as heroine in the sequel of Karthi Awara movie?
Pooja Hegde: ఆ సూపర్ హిట్ సీక్వెల్ సినిమాలో ఛాన్స్ దక్కించున్న బుట్టబొమ్మ ..!
తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది. ఇక పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Updated on: Feb 23, 2023 | 9:01 PM

టాలీవుడ్ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే.. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది.

తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది. ఇక పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

అలాగే తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. ఇక ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే చేసిన సినిమాలన్నీ బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, దళపతి విజయ్ తో చేసిన బీస్ట్, రామ్ చరణ్ సరసన నటించిన ఆచార్య, అలాగే బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన సర్కస్ ఇలా వరుసగా ఫ్లాపులు అందుకుంది ఈ భామ

అవారా సీక్వెల్ సినిమాను కూడా లింగుస్వామియే డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా తమిళ హీరో ఆర్య చేస్తున్నారని సమాచారం. ఆయనకు జోడీగా పూజా నటిస్తుందట

ఇక తెలుగులో మహేశ్ 29 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.




