
పాత్ బ్రేకింగ్‌లో ఎంత మజా ఉంటుందో.. ఆల్రెడీ ఉన్న పాత్‌లో జాగ్రత్తగా అడుగులు వేసి డెస్టినేషన్ రీచ్ కావడంలోనూ అంతే హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాలు.. రష్మిక అండ్ కీర్తీ సురేష్‌కి యాప్ట్ గా ఉంటాయి. ఇప్పుడున్న సిట్చువేషన్‌ని బట్టి రష్మిక సక్సెస్ అయ్యారు. మరి కీర్తి సురేష్ సంగతేంటి?

ఎదగడం అంటే అడుగులో అడుగు వేయడం... మెట్టుకు మెట్టూ ఎక్కడం అని స్ట్రాంగ్‌గా నమ్మారు రష్మిక మందన్న. అందుకే ఎదగడానికి ఉన్న ఏ అవకాశాన్నీ ఆమె మిస్ చేసుకోలేదు. ఓ వైపు గ్లామర్, మరోవైపు పెర్ఫార్మెన్స్.. ఇటు కమర్షియల్ ఫార్ములా... అన్నిటినీ జాగ్రత్తగా కవర్ చేస్తున్నారు.

మన దగ్గరే కాదు, నార్త్ సినిమాలకు కూడా బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నారు రష్మిక మందన్న. రెగ్యులర్ సినిమాల్లోనే కాదు, పీరియాడిక్ టచ్ ఉన్న మూవీస్‌కి కూడా ఆమెను తీసుకోవచ్చనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతోంది మేకర్స్ లో. పాటలకు కావాల్సిన గ్లామర్, సిట్చువేషన్‌కి కావాల్సిన సీరియస్‌నెస్‌నీ పండించగలరనే కాన్ఫిడెన్స్ పుష్ప2 చూశాక స్ట్రాంగ్‌గా రిజిస్టర్ అయింది ఇండస్ట్రీకి.

రష్మిక రూట్లో ట్రావెల్ చేస్తున్న సౌత్ హీరోయిన్లు ఎవరు అని ఆరా తీస్తే, అందరికీ కీర్తీ సురేష్ పేరు కనిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఫుల్ పెర్ఫార్మెన్స్ రోల్స్ కి పరిమితమయ్యారు ఈ లేడీ. తర్వాత కాస్త రూటు మార్చి కమర్షియల్ టచ్ ఉన్న సినిమాల్లో స్టార్ హీరోల పక్కన మెప్పించారు.

ఇప్పుడు నార్త్ ఎంట్రీ మూవీ బేబీ జాన్ కోసం ఫుల్‌గా మేకోవర్ అయ్యారు కీర్తి. ప్యాన్ ఇండియా ప్రాజెక్టుల్లో సక్సెస్ కావాలంటే గ్లామర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి బాగానే తెలుసుకున్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా రిలీజ్ అయిన నయన మటక్క సాంగ్‌లో కీర్తీని చూసిన వారు.. రష్మిక రూట్లో పక్కాగా ట్రావెల్ చేస్తున్నారుగా..! అని అంటున్నారంటేనే... కీర్తీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.