
పంద్రాగస్టు కి వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత సేపూ హీరోల గురించి, కెప్టెన్ల గురించే కబుర్లు చెబుతారేంటి? మా సంగతేంటి? అని అంటున్నారు హీరోయిన్లు. ఆగస్టు 15న విడుదలవుతున్న సినిమాలు కెరీర్ టర్నింగ్ పాయింట్స్ కావాలని కోరుకుంటున్నారు ఈ భామలందరూ... వారెవరో... మీరూ గుర్తుపట్టేశారా? కమాన్ డిస్కస్ చేసేద్దాం...

కావ్యా థాపర్ డ్యాన్సులు చాలా బాగా చేస్తుంది అని సర్టిఫికెట్ ఇచ్చారు రామ్ పోతినేని. ఆల్రెడీ మీ లిరికల్ వీడియోల్లో మేం కూడా చూశామని అంటున్నారు నెటిజన్లు. పూరి జగన్నాథ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఈ సినిమాతో కావ్యాథాపర్ క్లిక్ అవుతారా? మిస్టర్ బచ్చన్‌తో రంగంలోకి దిగుతున్న భాగ్యశ్రీతో పోటీపడతారా?

ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే టాలీవుడ్‌లో క్రేజీ టాక్ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ. ఆగస్టు 15న విడుదలవుతున్న మిస్టర్ బచ్చన్ ఎలాగైనా స్వీట్ మెమరీ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. అదే రోజు భాగ్యశ్రీతో పాటు థియేటర్లలోకి వచ్చేస్తున్నారు ఆయ్ బ్యూటీ నయన్ సారిక.

టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించిన పేరుంది నివేదా థామస్‌కి. ఈ సారి 35 చిన్న కథ కాదుతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈసినిమా సక్సెస్ అయితే టాలీవుడ్‌లో మళ్లీ ఓ రౌండ్ చుట్టేయొచ్చనుకుంటున్నారు నివేదా.

ఇప్పుడు అదర్ మార్కెట్స్ లోనూ హవా చూపిస్తున్నారు. సో విజయ్ అండ్ అజిత్ ప్లేస్‌ని ఇమీడియేట్‌గా కబ్జా చేసే అవకాశం సూర్య అండ్ విక్రమ్‌కి ఉందన్నమాట.