Summer Movies: ఈ సమ్మర్ రేసులో ఎవరెవరు ఉన్నారు.. ఇంకా ఎవరెవరు రాబోతున్నారు..?

| Edited By: Prudvi Battula

Jan 21, 2024 | 2:20 PM

సంక్రాంతి సంగతి ఓకే.. సమ్మర్ సంగతి ఏంటి..? గతేడాది కూడా ఇలాగే ఎన్నో ఆశలు పెట్టి చివరికి ఒక్కరంటే ఒక్క అగ్ర హీరో కూడా రాలేదు. మరి 2024లో పరిస్థితి ఎలా ఉండబోతుంది..? ఈ సారైనా స్టార్ హీరోలు వస్తారా..? ఈ సమ్మర్ రేసులో ఎవరెవరు ఉన్నారు.. ఇంకా ఎవరెవరు రాబోతున్నారు..? సంక్రాంతిలా సమ్మర్ కూడా కళకళలాడుతుందా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

1 / 5

2 / 5
సంక్రాంతికి అనుకున్నట్లుగానే 4 సినిమాలు వచ్చాయి. అందులో హనుమాన్ 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంటే.. గుంటూరు కారం ఒక్క వారంలోనే 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. మరోవైపు నా సామిరంగ కూడా నాగ్‌కు మరో విజయం తీసుకొచ్చింది. దాంతో అందరిచూపు సమ్మర్ వైపు వెళ్తుందిప్పుడు. 2024 వేసవిలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ బెర్త్ ఖాయం చేసుకున్నారు.

3 / 5
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమా ఎప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్ట్ 1 మాత్రమే సమ్మర్‌లో రానుంది. దీని బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. మరోవైపు మే 9న కల్కితో రాబోతున్నారు ప్రభాస్. ఇదైతే ఏకంగా 500 కోట్ల బిజినెస్ వైపు పరుగులు తీస్తుంది.

4 / 5
ప్రభాస్, తారక్ సినిమాలతో సమ్మర్ సీజన్‌కు కళ వచ్చింది. అయితే కేవలం ఈ ఇద్దరు మాత్రమే వస్తే పండగ లాంటి సీజన్ కాస్తా దండగ అయిపోతుంది. సమ్మర్ స్టార్టింగ్‌లో అంటే.. మార్చ్ 8న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. ఆ తర్వాత దేవర, కల్కి ఉన్నాయి.. తమిళం నుంచి విక్రమ్ తంగలాన్, విశాల్ రత్నం రానున్నాయి.

5 / 5
2023 సమ్మర్‌ను నీరు గార్చేసారు స్టార్ హీరోలు. సాయి ధరమ్ తేజ్, నాని, రవితేజ లాంటి మీడియం హీరోలతోనే సమ్మర్ అంతా వెళ్లిపోయింది. చూస్తుంటే ఈసారి కూడా అలాగే జరిగేలా కనిపిస్తుంది. తారక్, ప్రభాస్ తర్వాత ఆగస్ట్ 15న పుష్ప 2 రానుంది. ఈ లోపు బడా సినిమాలేం లేవు. మొత్తానికి చూడాలిక.. ఈ సమ్మర్‌ను ఎలా వాడుకుంటారో..?