
సినిమాలో రాయలసీమ యాస ఉంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న మాట. మరి విరూపాక్షతో ప్రూవ్ చేసుకున్న సాయితేజ్, ఇప్పుడు సంబరాల ఏటి గట్టులో ఆ యాసనే పట్టుకున్నారు. బాలయ్య నటిస్తున్న అఖండ 2 రిలీజ్ అవుతున్న అదే సీజన్‌లో వచ్చేయడానికి రెడీ అవుతున్నారు.

సెప్టెంబర్‌లో బాలయ్య, సాయి వస్తే, అక్టోబర్‌కి నేను ఖర్చీఫ్ వేస్తున్నానంటున్నారు గ్లోబల్ స్టార్. బుచ్చిబాబు సానా డైరక్ట్ చేస్తున్న ఆర్సీ 16ని అక్టోబర్ 16న స్క్రీన్ మీదకు తీసుకొస్తారన్నది వైరల్ న్యూస్.

చెర్రీ వచ్చిన ఒన్ వీక్‌కీ... అంటే అక్టోబర్ 23న ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్‌ని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట కెప్టెన్ మారుతి. అయితే ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.

అక్టోబర్‌లో మా సినిమా డివైన్ బ్లాక్ బస్టర్ కావడం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కాంతార మేకర్స్ లో. కదంబుల కాలం నాటి కథతో అత్యంత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు కాంతార ఫస్ట్ చాప్టర్‌ని.

సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయిన సినిమా విశ్వంభర. సమ్మర్‌లోనే స్క్రీన్స్ మీదకు వస్తారనే టాక్ ఉంది. అక్కడ మిస్ అయితే ఈ సీజన్‌నే టార్గెట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు టాక్సిక్, ఓజీ కూడా ఈ క్యూలో నిలబడుతాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి.