
అల్లు అర్జున్ మనకు ఐకాన్ స్టార్. ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఫస్ట్ ఎడిషన్‌కి కవర్‌స్టార్. సెల్ఫ్ మేడ్ స్టార్‌గా ఆయనకు ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఓ మార్కెట్ ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నటుడిగా గుర్తింపు పొందడమే అతి పెద్ద అవకాశంగా భావించే ఆయన హంబుల్‌నెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు. అది వారి స్వభావాన్ని బట్టి ఉంటుందన్నది బన్నీ ఒపీనియన్. తనను తాను ఎప్పుడూ సామాన్యుడిగానే భావిస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు బన్నీ. ఇతరుల సినిమాలను చూసేటప్పుడు కూడా స్టైలిష్ స్టార్... అలాగే చూస్తారట.

ఖాళీ సమయాల్లో ఏం చేస్తారని ఎవరైనా బన్నీని అడిగితే... నథింగ్ అని సింపుల్‌గా చెప్పేస్తారు. కనీసం పుస్తకం కూడా పట్టుకోనని అంటున్నారు ఐకాన్ స్టార్. ఖాళీ సమయాలను.. అలా ఖాళీగానే గడపడానికి ఇష్టపడతారట.

ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో మన స్టార్ల గురించి అరుదుగా రాస్తుంటారు. ఇప్పటికే జక్కన్న హీరోలు ప్రభాస్, తారక్, చెర్రీ గురించి వార్తలు కనిపించాయి. అయితే జక్కన్న షేడ్ లేకుండానే.. ఈ క్రెడిట్ మా హీరో ఖాతాలో చేరిందని ఖుషీగా చెప్పుకుంటోంది అల్లు ఆర్మీ.

ప్రస్తుతం పుష్ప2 సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇది గురూజీకి తొలి పాన్ ఇండియా చిత్రం. మిథాలీజి నేపథ్యంలో తెరకెక్కనుంది.