Rare Record: రేర్‌ కాన్సెప్ట్ సినిమాలు.. ఇవి క్రియేట్‌ చేసే రికార్డులు ఏంటి.?

|

Apr 23, 2024 | 2:38 PM

2024లో ఓ రేర్‌ రికార్డును సెట్‌ చేయడానికి రెడీ అవుతోంది సౌత్‌ ఇండియన్‌ స్క్రీన్‌. ఆల్రెడీ అరుదైన రికార్డుకు శుభారంభం పలికేసింది ఆడుజీవితం. నెక్స్ట్ లైన్లో ఉన్నారు పుష్పరాజ్‌, తంగలాన్ అండ్‌ కంగువ టీమ్‌. ఏమిటి ఈ సినిమాల ప్రత్యేకత.. ఏంటి ఇవి క్రియేట్‌ చేయబోతున్న రికార్డులు... రేర్‌ కాన్సెప్టులతో, హీరోలు ప్రాణం పెట్టి పనిచేస్తున ఈ సినిమాలు, 2024లో... వరల్డ్ మూవీస్‌ హిస్టరీలో ఎలాంటి స్థానాన్ని ఆక్రమిస్తాయో లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ...

1 / 5
విడుదలైన 25 రోజుల్లో 150 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తోంది ఆడుజీవితం. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కోసం పృథ్విరాజ్‌ ప్రాణం పెట్టారని ప్రశంసిస్తున్నారు జనాలు. మన సినిమా సరికొత్త శిఖరాలను అందుకుంటోంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు పృథ్విరాజ్‌.

2 / 5
సినిమాను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటే, అప్పటిదాకా పడ్డ కష్టాన్నంతా మర్చిపోతామన్నది ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఎప్పుడూ చెప్పేమాట, ఆల్రెడీ అరుదైన రికార్డులన్నిటినీ ఐకాన్‌స్టార్‌ పేరు మీద రాసింది పుష్ప.

3 / 5
ఇప్పుడు పుష్ప2 మరెన్ని రకాల గుర్తింపు తెచ్చిపెడుతుందోనని ఆతృతగా వెయిట్‌ చేస్తోంది అల్లు ఆర్మీ. మూడేళ్లుగా పుష్ప2 ఒక్కటే ధ్యాస, శ్వాసగా పనిచేస్తున్నారు బన్నీ. ఇండియన్‌ సినిమా రికార్డులన్నిటినీ పుష్ప సీక్వెల్‌తో తిరగరాయాలన్న కమిట్‌మెంట్‌ కనిపిస్తోంది స్టైలిష్‌ స్టార్‌లో.

4 / 5
తిండీ, నిద్రా లేకుండా తంగలాన్‌ కోలార్‌ గోల్డ్ ఫీల్డ్స్ గురించి కలలు కంటున్నానని చెబుతున్నారు హీరో విక్రమ్‌. సరికొత్త గెటప్‌లో ఆయన చేసిన సినిమా తంగలాన్‌. ఈ సినిమా ఆస్కార్‌ వేదిక మీద ఎంతో ప్రతిష్టను మూటగట్టుకోవడం ఖాయం అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది యూనిట్‌లో.

5 / 5
పుష్ప, తంగలాన్‌ సినిమాల కోవలోకే చేరనుంది కంగువ. ప్రపంచవ్యాప్తంగా డే ఒన్నే సత్తా చాటాలనే ధ్యేయంతో పనిచేస్తోంది యూనిట్‌. నెవర్‌ బిఫోర్‌ అవతార్‌లో మెస్మరైజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు సూర్య. జానపద యోధుడిని, మోడ్రన్‌ వీరుడిని ఎదురెదురుగా నిలబెట్టి రీసెంట్‌గా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. కంగువ వరల్డ్ ఎలా ఉండబోతోందోననే ఇంట్రస్ట్ జనాల్లోనూ మెండుగా కనిపిస్తోంది. 