
తన హెల్త్ అప్‌డేట్‌తో అభిమానులకే కాదు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు స్టార్ హీరో సమంత. సీరియస్ హెల్త్ కండిషన్ గురించి సామ్ రివీల్ చేయటంతో... ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న ఫిలిం స్టార్స్ గురించి ఆరాలు తీసే పనిలో పడ్డారు ఆడియన్స్.

ముఖ్యంగా నార్త్‌లో ఇలాంటి సీరియస్ హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ల నెంబర్ కాస్త గట్టిగా కనిపిస్తోంది.కండరాలకు సంబంధించిన అరుదైన వ్యాదితో బాధపడుతున్నట్టుగా సోషల్ మీడియా వేదిక అభిమానులతో షేర్ చేసుకున్నారు సమంత. దీంతో అసలు ఆ డిసీజ్ ఏంటి..?

దాని ప్రభావం ఎలా ఉంటుందన్న ఎంక్వైరీలతో పాటు ఇలా అరుదైన సమస్యలతో బాధపడుతున్న ఫిలిం స్టార్స్ గురించి కూడా చర్చించుకుంటున్నారు సినీ అభిమానులు.

సమంత లాగే రేర్ మజిల్ డిసీజ్‌తో ఇబ్బంది పడుతున్నారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. బయటికి హల్క్‌లా కనిపించే సల్మాన్.. కొన్ని సందర్భాల్లో ఫుడ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు.

దవడ కండరాల్లో తీవ్ర నొప్పి కారణంగా రోజుల తరబడి లిక్విడ్ ఫుడ్‌తోనే కాలం గడిపేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇంత పెయిన్‌ను కూడా బరిస్తూ షూటింగ్‌లు చేస్తుంటారు భాయ్‌జాన్.

కూలీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం అమితాబ్‌ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఈ ప్రమాదంలో ఒక వెయిన్ డ్యామేజ్ కావటం వల్ల ఇప్పటికీ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఎక్కువ సేపు పని చేస్తే తీవ్రమైన నొప్పితో పాటు కండరాలు చచ్చుబడిపోయే అరుదైన కండిషన్‌ను అమితాబ్ ఫేస్ చేస్తున్నారు.

గ్రీకు వీరుడు హృతిక్ కూడా గతంలో సీరియస్ హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడ్డారు. సినిమాల్లోకి రాకముందు వెన్నునొప్పితో బాధపడిన హృతిక్. ఈ సమస్య నుంచి బయట పడేందుకు వర్క్ అవుట్స్ చేయటం ప్రారంభించారు.ఫైనల్‌గా ఆ సమస్య నుంచి కోలుకొని బాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు.

వీళ్లే కాదు.. సంజయ్ దత్, సోనాలీ బ్రిందే లాంటి స్టార్స్ క్యాన్సర్‌ను జయిస్తే...

దీపికా పదుకొనే, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్స్ డిప్రెషన్ నుంచి కోలుకొని సూపర్ స్టార్స్‌గా ఎదిగారు.

యాక్టర్స్ లో ఇలా చాల హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నపటికీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎప్పటికి ముందుకు వస్తారు..