లీడర్‌ రామయ్యగా వస్తోన్న సేతుపతి.. సల్మాన్ ‘టైగర్‌’ టీజర్‌ డేట్ ఫిక్స్..

|

Aug 05, 2023 | 2:00 PM

రామ్‌చరణ్‌ని తాను కొడుకులా భావిస్తున్నట్టు తెలిపారు ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని. రామ్‌చరణ్‌, సముద్రఖని కలిసి ట్రిపుల్‌ ఆర్‌లో నటించారు. ఆ సినిమా సమయంలోనే చరణ్‌ తనకు బాగా దగ్గరయ్యారని అన్నారు సముద్రఖని. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న గేమ్‌ చేంజర్‌లోనూ మంచి రోల్‌ చేశారు సముద్రఖని.

1 / 5
Ramcharan: రామ్‌చరణ్‌ని తాను కొడుకులా భావిస్తున్నట్టు తెలిపారు ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని. రామ్‌చరణ్‌, సముద్రఖని కలిసి ట్రిపుల్‌ ఆర్‌లో నటించారు. ఆ సినిమా సమయంలోనే చరణ్‌ తనకు బాగా దగ్గరయ్యారని అన్నారు సముద్రఖని. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న గేమ్‌ చేంజర్‌లోనూ  మంచి రోల్‌ చేశారు సముద్రఖని.

2 / 5
Vijay sethupathi: కన్నడ సీఎం సిద్ధరామయ్య జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా లీడర్‌ రామయ్య. రెండు పార్టులుగా ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫస్ట్ పార్టులో సిద్ధరామయ్య బాల్యం, యవ్వనం గురించి చూపిస్తారు. ఇందులో కొన్ని సన్నివేశాల్లో విజయ్‌ సేతుపతి కనిపిస్తారు. సెకండ్‌ పార్టులో సేతుపతి మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారు.

3 / 5
kajol: పే ఈక్వాలిటీ గురించి మాట్లాడారు నటి కాజోల్‌. ఇండియన్‌ సూపర్‌ వుమన్‌ సినిమా చేయాలనుకుంటే, పఠాన్‌కి పెట్టినంత ఖర్చుపెట్టాలని, ఆ సినిమాలో హీరోకి ఇచ్చినంత పారితోషికం ఇవ్వాలని అన్నారు. ఇండస్ట్రీలో పురుషులకు సమానంగా స్త్రీలు సమానమైన పారితోషికం తీసుకునే రోజు ఎప్పుడొస్తుందనే విషయం మీద ఎవరైనా జోస్యం చెబితే  బావుంటుందని చమత్కరించారు కాజోల్‌.

4 / 5
Rare pic: కోలీవుడ్‌ డైరక్టర్లు తీసుకున్న పిక్‌ ఒకటి లేటెస్ట్ గా వైరల్‌ అవుతోంది. ఈ పిక్‌లో మణిరత్నం, శంకర్‌, గౌతమ్‌ వాసుదేవమీనన్‌, లోకేష్‌ కనగరాజ్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌, లింగుస్వామి, కార్తిక్‌ సుబ్బరాజ్‌తో పాటు మరికొందరు ఉన్నారు. కమర్షియల్‌ సినిమాలతో బిజీగా ఉన్న ఈ డైరక్టర్లను ఇలా ఒక ఫ్రేమ్‌లో చూడటం ఆనందంగా ఉందని అంటున్నారు నెటిజన్లు.

5 / 5
Tiger 3: సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న సినిమా టైగర్‌ 3. ఈ సినిమా టీజర్‌ని ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే కథ కావడంతో రిలీజ్‌కి ఇది పర్ఫెక్ట్ టైమ్‌ అంటున్నారు మేకర్స్. మనీష్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ 10న స్క్రీన్స్ మీదకు రానుంది టైగర్‌3.