Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు సీన్ అంతా అర్థమైందిగా

| Edited By: Phani CH

Jan 27, 2025 | 9:00 PM

విజయ్ దేవరకొండ ప్లాన్ మార్చేస్తున్నారు. ఇప్పటికే చేయాల్సిన రిస్క్‌లన్నీ చేసిన రౌడీ బాయ్.. ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారు. సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? తర్వాతి సినిమాల కథేంటి..?

1 / 5
విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. కెరీర్ మొదట్లో రాకెట్‌లా దూసుకుపోయిన రౌడీ బాయ్‌.. ఆ తర్వాత జోరు తగ్గించారు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బెడిసికొడుతున్నాయి.

2 / 5
ఖుషీ ఓకే అనిపించిందని ఆనందించేలోపే.. ఫ్యామిలీ స్టార్ దెబ్బ పడిపోయింది. అయితే ఈ మధ్యే కల్కిలో అర్జునుడిగా మెరిసారు విజయ్. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి.

3 / 5
గతంలో లైగర్ చేస్తున్నపుడే ఖుషీ.. అది సెట్స్‌పై ఉన్నపుడే గౌతమ్ సినిమా.. అది పూర్తవ్వక ముందే ఫ్యామిలీ స్టార్‌కి ఓకే చెప్పారు విజయ్. ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ వద్దు.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు.

4 / 5
ఇప్పటికే 2 సినిమాలు ఫైనల్ అయినా.. నిదానమే ప్రధానం అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమాలో పోలీస్‌గా నటిస్తున్నారు విజయ్. ఇది పూర్తయ్యాక రాహుల్ సంక్రీత్యన్ సినిమా సెట్స్‌పైకి రానుంది.

5 / 5
ప్రస్తుతం ఈ చిత్ర సెట్ వర్క్ మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 18వ శతాబ్ధపు కథతో తెరకెక్కనుంది. ఇక రవికిరణ్ కోలా సినిమా పూర్తిగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత.