3 / 5
ఎంకరేజ్ చేయకండి... ప్లీజ్ అని అంటున్నారు తమన్నా భాటియా. ఇంతకీ దేనిగురించి మిల్కీబ్యూటీ రిక్వెస్టు అని అంటారా? గాసిప్స్ గురించేనని రిప్లై ఇచ్చేస్తున్నారు ఈ భామ. సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడేస్తుంటారన్నది తమన్నా బాధ. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారికి ఇలాంటివి తప్పవని తనకు తెలుసని అన్నారు. అంతే కాదు, సెలబ్రిటీల జీవితంలో ఏం జరగాలో, ఏం జరగకూడదో జోస్యం చెప్పేవాళ్లు ఎక్కువయ్యారని అంటున్నారు మిల్కీబ్యూటీ. అందుకే గాసిప్స్ ని ఎవరూ పెద్దగా కేర్ చేయకూడదని అంటున్నారు. ముంబైలో పుట్టిపెరిగిన తనకు, నార్త్ సినిమా ఎంత ముఖ్యమో, సౌత్ సినిమా కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటున్నారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే కేరక్టర్లతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటానంటున్నారు ఈ లేడీ.