
బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్ స్టాపబుల్ సీజన్ 4 ఏడో ఎపిసోడ్ కు విక్టరీ వెంకటేశ్ అతిథిగా హాజరయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ షోకు విచ్చేశారు.

వెంకటేష్ తో పాటు సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ కూడా ఈ షోలో సందడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కాలేజీ రోజుల్లో తాను కూడా గ్యాంగ్ మెయిన్ టైన్ చేశానని, చాలా అల్లరి పనులు చేశానని విక్టరీ వెంకటేష్ గుర్తుకు తెచ్చుకున్నారు.

అలాగే నాన్న గురించి మాట్లాడుతూ సురేష్ బాబు, వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. ఇక వెంకటేశ్ తన ముగ్గురు కూతుర్ల గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మొత్తానికి ఈ బాలయ్య- వెంకీల అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఫుల్ ఫన్ తో సాగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 27న రాత్రి 7 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది