Vani Jairam: ఆసేతుహిమాచలం తన మధురగీతాలతో ఆబాలగోపాలాన్ని అలరించిన ‘వాణీ జయరాం’ రేర్ ఫోటోస్..

ప్రముఖ గాయని వాణీజయరామ్‌ చెన్నైలోని స్వగృహంలో ఈ రోజు కన్నుమూశారు. నేపథ్యగాయనిగా ఎన్నో గొప్ప పాటలను పాడారు వాణీజయరామ్‌. 1945 నవంబర్‌ 30న జన్మించారు వాణీజయరామ్‌.తమిళనాడులోని వేలూరులో పుట్టిన ఆమె అసలు పేరు కలైవాణి.

|

Updated on: Feb 04, 2023 | 4:00 PM

ప్రముఖ గాయని వాణీజయరామ్‌ చెన్నైలోని స్వగృహంలో ఈ రోజు కన్నుమూశారు. నేపథ్యగాయనిగా ఎన్నో గొప్ప పాటలను పాడారు వాణీజయరామ్‌. 1945 నవంబర్‌ 30న జన్మించారు వాణీజయరామ్‌.

1 / 14
తమిళనాడులోని వేలూరులో పుట్టిన ఆమె అసలు పేరు కలైవాణి. ఆమెది సంగీత కుటుంబం. శాస్త్రీయ సంగీతానికి గౌరవం ఇచ్చే కుటుంబంలో పుట్టారు వాణీ జయరామ్‌.కర్ణాటకసంగీతంలో శిక్షణ పొందిన ఆమె ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు పాడటం దిట్ట.

2 / 14
అలా ఆమె రేడియోలో పాడటం మొదలుపెట్టారు. సినిమా సంగీతానికి వారి కుటుంబంలో అసలు స్థానం ఉండేది కాదు. సినిమా పాటలను వినడానికి కూడా తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదట. అయినా సినిమాల్లో పాడాలన్నది ఆమె కోరిక.

3 / 14
చెన్నై క్వీన్‌ మేరీస్‌ కాలేజీలో ఎకనామిక్స్ లో డిగ్రీ చేశాక స్టేట్‌ బ్యాంక్‌‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం చేశారు వాణీ జయరామ్‌.. ఆ ఉద్యోగం రీత్యా హైదరాబాద్‌కి బదిలీ అయ్యారు. హైదరాబాద్‌కి వచ్చాకే జయరామ్‌తో పెద్దలు వివాహం చేశారు.

4 / 14
పెళ్లయ్యాక ఆయన కోసం ఆమె మకాం ముంబైకి మారింది. జయరామ్‌కి స్వతహాగా సంగీతం అంటే ఇష్టం. ఆయన సితార్‌ వాయించేవారు. అలా ఆయన ప్రోత్సాహంతో ఉస్తాద్‌ అబ్దుల్‌ రహమాన్‌ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు వాణీ జయరామ్‌.

5 / 14
రోజుకు 18 గంటల పాటు సాధన చేసేవారట.గురువుల ప్రోత్సాహం వల్లనే 1969లో బాంబేలో తొలి కచ్చేరీ చేశారు వాణీ జయరామ్‌.  అలా ఆమె ఇచ్చిన ఓ కచేరీకి సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్‌ హాజరయ్యారు. ఆమె పాట నచ్చి గుడ్డీ సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు.

6 / 14
తొలి సినిమాలో పాడిన బోలే రే పపి పాట అప్పట్లో పెద్ద హిట్‌ అయింది. దానికి తాన్‌సేన్‌ అవార్డుతో పాటు మరికొన్ని అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత ఆమె కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోనవసరం రాలేదు.

7 / 14
నౌషాద్‌, ఆర్‌.డి.బర్మన్‌, మదన్‌మోహన్‌, ఓపీ నయ్యర్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, పండిట్‌ రవిశంకర్‌, ఇళయరాజా, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌, కె.వి.మహదేవన్‌ వంటి ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. రఫి, కిశోర్‌కుమార్‌ వంటివారితోనూ పాడారు.

8 / 14
ఎస్‌.పి.కోదండపాణి సంగీతంలో అభిమానవంతుడు అనే సినిమాలో ఎప్పటివలె కాదురా స్వామీ అంటూ పాడిన పాట.. ఆమె తొలి తెలుగు సినిమా పాట. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా పాటలు పాడిన గళం ఆమెది.  దాదాపు ఇరవైవేల పాటలకు పైగా పాడారు వాణీజయరామ్‌.

9 / 14
సినిమా పాటలనే కాదు, ఆధ్యాత్మిక గీతాలను కూడా అలపించారు వాణీజయరామ్‌.అత్యంత క్లిష్టమైన కంపోజిషన్‌ని కూడా సునాయాసంగా పాడతారనే పేరు ఉంది వాణీజయరామ్‌కి.తమిళ్‌, మలయాళం, కన్నడలో ఆమె  వేల పాటలు పాడారు. క్లాస్‌ అయినా, క్లాసికలైనా, జానపదమైనా, జాజ్‌బీటైనా, ఆమె పాడిన పాట ఏదైనా సరే దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది.

10 / 14
ఆమె గాత్రానికి స్పెషల్‌ గుర్తింపు ఉంది. తన జీవితాంతం సంగీతానికే అంకితం అని ప్రకటించారు వాణీ జయరామ్‌.కె.బాలచందర్‌ అపూర్వ రాగంగళ్‌ సినిమాకు ఓ సారి, శంకరాభరణం సినిమాకు రెండో సారి, హిందీలో మీరా సినిమాకు మరో సారి జాతీయ అవార్డులను దక్కించుకున్నారు వాణీ జయరామ్‌.

11 / 14
ఒడిశా, గుజరాత్‌, తమిళనాడు స్టేట్‌ అవార్డులతో పాటు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్‌. ఫిల్మ్ ఫేర్‌ లైఫ్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నారామె.ఇటీవల ఆమెకు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది.

12 / 14
ఆ అవార్డు అందుకోకుండానే ఆమె కన్నుమూయడం బాధాకరం అంటున్నారు అభిమానులు.

ఆమె కన్నుమూశారని వార్త తెలిసి సినీ, సంగీతలోకం శోకసంద్రంలో మునిగిపోయింది

ఆ అవార్డు అందుకోకుండానే ఆమె కన్నుమూయడం బాధాకరం అంటున్నారు అభిమానులు. ఆమె కన్నుమూశారని వార్త తెలిసి సినీ, సంగీతలోకం శోకసంద్రంలో మునిగిపోయింది

13 / 14
 అపూర్వమైన గళం అంటూ ఆమె పాడిన పాటలను గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.

14 / 14
Follow us
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్

పాక్‌కు ఐఎంఎఫ్ గుడ్ న్యూస్ ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ఔరంగజేబు చేతిలో

ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..

మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..

ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..

డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..

ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్

ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.