Rajeev Rayala |
Oct 15, 2022 | 7:55 PM
వాణీకపూర్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా రాణిస్తోంది ఈ చిన్నది. వాణీకపూర్ టెప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు.
వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. నేచురల్ స్టార్ నాని సరసన 'ఆహా కళ్యాణం' తో టాలీవుడ్ లో లాంచ్ అయింది.
బాలీవుడ్ లో 'శుద్ దేశీ రొమాన్స్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ అటుపై 'బేఫ్ క్రే'..'వార్' లాంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం అక్కడ కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టి పనిచేస్తోంది.
స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ వచ్చిన ఏ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అన్న సంకల్పంతో ముందుకెళ్తోంది.
తాజాగా మరోసారి న్యూ డిజైనర్ వేర్ లో అగ్గిరాజేస్తుంది. షోల్డర్ లెస్ ప్లోరల్ దుస్తుల్లో హాట్ అప్పిరియన్స్ కుర్రాళ్లకు మతిపొగోడుతుంది.