- Telugu News Photo Gallery Cinema photos Ustaad Bhagat Singh movie director harish shankar ready to another movies with another heros due to pawan kalyan busy with politics Telugu Heroes Photos
Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఉంటే ఓకే.. లేకున్నా నో ప్రాబ్లమ్.! హరీష్ శంకర్ ప్లానింగ్ అదుర్స్.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ఆయన గురించి ఇండస్ట్రీలో మాత్రం చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్లానింగ్స్ అన్నీ మారిపోతున్నాయి. పాలిటిక్స్ నుంచి వచ్చాక కూడా పవన్ దీన్ని కాకుండా మరో సినిమా వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. మరి అందులో నిజమెంత..? అదే జరిగితే హరీష్ శంకర్ ప్లాన్ ఏంటి.? ఆర్నెళ్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు.
Updated on: Mar 14, 2024 | 10:19 PM

మీరస్సలు ఊహించనిది ఇవ్వబోతున్నామంటూ ఉస్తాద్ టీం ట్వీట్ చేసారు. దాంతో సీన్‌లోనే లేని సినిమా దెబ్బకు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుందిప్పుడు.

మరి అందులో నిజమెంత..? అదే జరిగితే హరీష్ శంకర్ ప్లాన్ ఏంటి.? ఆర్నెళ్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. దానికోసం సినిమాలను పూర్తిగా పక్కనబెట్టేసారు. నిర్మాతలకు కూడా ఇదే విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్పారు పవన్.

తాజాగా ఉస్తాద్ నుంచి మరో టీజర్ విడుదల చేయనున్నారు. పొలిటికల్ ఫేవర్ ఉండేలా అదిరిపోయే డైలాగ్ టీజర్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మార్చి 19న ఈ గ్లింప్స్ రాబోతుంది.

పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో ఉస్తాద్‌కి బ్రేకులు పడి 4 నెలలు దాటిపోయింది. కేవలం 5 రోజులు మాత్రమే షూట్ చేసారు హరీష్ శంకర్. అందులోంచే ఓ టీజర్ విడుదల చేసారు కూడా.

పవర్‌ఫుల్ పొలిటికల్ పంచులతో టీజర్‌ని సిద్ధం చేశారని, ఆ డైలాగులు పవన్‌కి పొలిటికల్ గ్రౌండ్‌లో పనికొస్తాయన్నది ఇంకో మాట. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో ఈ మధ్య గ్లాసు గురించి పంచ్‌లు రాశారు హరీష్‌శంకర్. ఈ పంచ్‌ల గురించి పవన్‌కల్యాణ్ రాజకీయ వేదికల మీద కూడా ప్రస్తావించారు.

హరీష్ శంకర్ ఈ డైలాగులను ఎంతో ఇష్టపడి రాశారని చెప్పారు పవన్ కల్యాణ్. ఉస్తాద్ భగత్‌సింగ్ తరహా డైలాగులే ఇప్పుడు హరిహరవీరమల్లులోనూ ఉంటాయా? అనే మాట పదే పదే వినిపిస్తోంది.

రెండేళ్లు వేచి చూసిన హరీష్ శంకర్ సైతం ఇప్పట్లో లేదు.. రాదని ఫిక్సైపోయి రవితేజ సినిమాతో బిజీ అయిపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి ఇటు ఉస్తాద్ టీం నుంచి ఎక్స్‌పెక్ట్ ది అన్ఎక్స్‌పెక్టెడ్ అనే ట్వీట్ వచ్చింది.

ఊహించినపుడు ఇచ్చే గిఫ్ట్ కంటే.. అస్సలు ఆలోచనల్లో కూడా లేనపుడు.. ఇది రాదు అని ఫిక్సైపోయినపుడు ఇచ్చే బహుమతికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడలాంటి గిఫ్ట్‌నే ప్లాన్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ టీం.




