
హీరోయిన్‌గా నటించాలన్నా.. స్పెషల్ సాంగ్ చేయాలన్నా.. తమన్నాకు తిరుగులేదు. రెండు పాత్రల్లోను చక్కగా ఒదిగిపోతుంటారు ఈ బ్యూటీ. ఇలాంటి ఇమేజ్ చాలా తక్కువ మంది హీరోయిన్లకు ఉంటుంది.

అందులో మిల్కీ బ్యూటీ ఒకరు. ఓవైపు ఓదెల 2 లాంటి సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లోనూ మత్తెక్కిస్తున్నారు తమన్నా. భాషతో పనిలేకుండా అన్ని ఇండస్ట్రీల్లో బిజీగానే ఉన్నారు తమన్నా. ముఖ్యంగా హీరోయిన్ కంటే ఎక్కువగా.. ఈ మధ్య స్పెషల్ సాంగ్స్‌పై ఫోకస్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ.

గతేడాది స్త్రీ 2.. తాజాగా రైడ్ 2లో ఈ భామ చేసిన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మధ్య తమన్నాను టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ చేసారు హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా. రైడ్ 2లో తమన్నా చేసిన నషా పాట కంటే.. జాట్‌లో తాను చేసిన సారీ బోల్ పాటకే ఎక్కువ రీచ్ వచ్చిందనే అర్థం వచ్చేలా పోస్ట్ చేసారు ఊర్వశి.

కానీ ఆ పోస్ట్‌కు ట్రోల్స్ రావడంతో వెంటనే డిలీట్ చేసారు. గతంలో కియారా అద్వానీపై కూడా నెగిటివ్ పోస్ట్ చేసారు ఊర్వశి. బ్రో, వాల్తేరు వీరయ్య, ఏజెంట్, స్కంద.. తాజాగా జాట్ లాంటి సినిమాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేసారు.

తన పాపులారిటీ కోసం కావాలనే స్టార్ హీరోయిన్స్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తుంటారంటూ ఊర్వశి రౌతెలాపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమన్నాను కూడా టార్గెట్ చేసిందీ బ్యూటీ. కానీ ఎంత చేసినా.. స్పెషల్ సాంగ్స్ విషయంలో తమన్నాకు వచ్చినంత రీచ్ ఊర్వశి పాటలకు రాదనేది కాదనలేని వాస్తవం. మిల్కీ బ్యూటీ రేంజ్ అలా ఉంది మరి..!