
మరోవైపు ప్రమోషన్లు కూడా అంతే వేగంగా, ప్లాన్డ్ గా జరుగుతున్నాయి. ఇవ్వబోయే అప్‌డేట్ ముందు నుంచే సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అప్‌డేట్ వచ్చాక ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.

చిన్నగా మొదలై స్పాన్ పెంచుకుంటూ పోతుంటే ఆ కిక్కే వేరప్పా అని అంటున్నారు హనుమాన్ మేకర్స్. ఈ సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా మొదలై ప్రభంజనం సృష్టించింది హనుమాన్ సినిమా.

చిన్న సినిమాలైనా ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకుంటాయా అంటే అది కూడా జరగలేదు. నోటబుల్ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవటంతో ఏకంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కన్నడ కాంతార విషయంలోనూ ఇదే జరిగింది. 16 కోట్లతో భూతకోల కాన్సెప్ట్ తో తెరకెక్కిన కాంతార దాదాపు 400కోట్లకు పైగా కలెక్ట్ చేసి డివైన్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఏకంగా ఆస్కార్‌ని టార్గెట్ చేసింది టీమ్.

ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. వేసే ప్రతి అడుగూ ఆస్కార్ వైపే అన్నట్టుంది కన్నడ ప్రీక్వెల్ టీమ్ ఆలోచన. కన్నడలో కాంతార కన్నా ముందే ఈ విషయాన్ని టేస్ట్ చేసిన సినిమా కేజీయఫ్.

ఎలాంటి బజ్ లేకుండా విడుదలైన కేజీయఫ్ ఫస్ట్ పార్టుకు వచ్చిన స్పందన చూసి, సెకండ్ పార్టుకి ఖర్చుని అమాంతం పెంచేశారు మేకర్స్. క్వాలిటీ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించి జనాలతో వావ్ అనిపించారు.

తెలుగులో కార్తికేయ విషయంలోనూ ఇదే జరిగింది. కార్తికేయ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో సెకండ్ పార్టు ప్యాన్ ఇండియా రేంజ్‌లో సౌండ్ చేసింది. త్వరలో ప్రేమలు సీక్వెల్‌కి ఎంత ఖర్చుపెడతారనే ఆసక్తి కనిపిస్తోంది జనాల్లో.