- Telugu News Photo Gallery Cinema photos Universal Star Prabhas next movie fauji with hanu raghavapudi heroine sajal ali finalized Telugu Heroes Photos
Prabhas: యూనివర్శల్ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు.!
సినిమా యూనివర్శల్ రేంజ్‌లో ఉన్నప్పుడు, స్టార్ కాస్ట్ కూడా అదే స్థాయిలోనే ఉండాలి కదా.. మేం లోకల్ అనే మాట అక్కడ చెల్లుబాటు అవుతుందా.? చేయాలంటే చేయొచ్చేమో కానీ.. కాంప్రమైజ్ కావడం ఎందుకు చెప్పండి... ఇప్పుడు మన మేకర్స్ మనసుల్లో ఇలాంటి ఆలోచనలే మెదులుతున్నాయి. రాజమౌళి టు హను రాఘవపూడి అందరి మనస్సుల్లోనూ ఇలాంటిదే ఓ మాట మళ్లీ మళ్లీ మోగుతోంది.
Updated on: Jul 25, 2024 | 8:12 PM

సినిమా యూనివర్శల్ రేంజ్‌లో ఉన్నప్పుడు, స్టార్ కాస్ట్ కూడా అదే స్థాయిలోనే ఉండాలి కదా.. మేం లోకల్ అనే మాట అక్కడ చెల్లుబాటు అవుతుందా.? చేయాలంటే చేయొచ్చేమో కానీ..

పార్ట్ 1 పూర్తిగా ప్రభాస్ వర్సెస్ అమితాబ్ అన్నట్టుగా సాగింది కథా కథనం. కానీ పార్ట్ 2లో కమల్ కూడా యాడ్ అవుతారు. దీంతో మరింత గ్రాండ్ విజువల్స్, అంతకు మించిన సర్‌ప్రైజ్‌లకు సిద్ధంగా ఉండాలన్న హింట్ ఇస్తోంది కల్కి 2898 ఏడీ మూవీ టీమ్.

మరో నాలుగైదు నెలల్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫార్మ్ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.

దీని గురించి అధికారికంగా అనౌన్స్ మెంట్ రాకముందే.. ఇంకో ఇంట్రస్టింగ్ విషయం స్పీడందుకుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ తెరకెక్కుతోంది.

ఈ సినిమా కోసం పాకిస్తానీ నటి సజన్ అలీ పేరు పరిశీలనలో ఉందట. నిజంగానే ఆమెను యూనిట్ అప్రోచ్ అయిందా? లేదా? అనే విషయాలను పక్కనపెడితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ట్రెండ్‌లో ఉంది డార్లింగ్ అండ్ పాకిస్తానీ యాక్ట్రెస్ టాపిక్.





























