
బుల్లితెరపై ఒకే ఒక్క సీరియల్ ద్వారా స్టార్ హీరోహీరోయిన్లను మించి క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అమాయకత్వం, అభినయంతో తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. తన మొదటి సీరియల్లోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసిన ఈ అమ్మడు .. ఆ తర్వాత తెలుగులో మరో సీరియల్ ద్వారా అలరించింది.

పైన ఫోటోలో కనిపిస్తున్న వయ్యారి ఎవరో తెలుసా.. ? సీరియల్లో పద్దతిగా లంగావోణిలో ఎంతో అందంగా కనిపించింది. సహజ నటనతో తెలుగు వారిని కట్టిపడేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదండి.. టీవీ నటి ప్రియాంక జైన్. బుల్లితెరపై మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో మాటలు రాని అమ్మాయిగా కనిపిస్తూ సహజ నటనతో కట్టిపడేసింది. ఈ సీరియల్ తో తెలుగులో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది.

1998లో జూలై 2న జన్మించిన ప్రియాంక.. జైన్ కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో బుల్లితెరలోకి వచ్చింది. కన్నడలో పలు సీరియల్స్ చేసిన ప్రియాంక జైన్.. ఆ తర్వాత మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

తమిళంలో రంగి తరంగ అనే సినిమాతో కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. ఆ తర్వాత కన్నడలో గోలిసోడా అనే సినిమాలో నటించింది. కానీ ఈ బ్యూటీకి సినిమాలకంటే ఎక్కువగా సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.