సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారమే లేపింది. పలువురు నటీమణులు ధైర్యంగా ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టారు.
ప్రముఖ టెలివిజన్ నటి రతన్ రాజ్‌పుత్ గతంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్లు తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆడియన్ కోసం ముంబయిలోని ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లిన తనకు ఎదురైన సంఘటన గురించి తెల్పింది.
ఓషివారా సబర్బ్ హోటల్‌లో ఆడిషన్‌కి నేను నా స్నేహితురాలిని తీసుకుని వెళ్లాను. ఆడిషన్ పూర్తయిన తర్వాత డైరెక్టర్‌కి మీ వర్క్ నచ్చింది, మీటింగ్‌కి వెళ్లండని ఒక కో ఆర్డినేటర్ చెప్పాడు. మీటింగ్ కోసమని పై అంతస్తుకి వెళ్లాను. వద్దంటున్నా కూల్ డ్రింక్ తాగమని బలవంతం చేశారు. ఆ కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఎందుకో తేడాగా అనిపించింది. మరో ఆడిషన్ ఉంటుంది దానికి హాజరుకావాలని చెప్పడంతో మేము ఇంటికి వెళ్లాము.
మేము ఇంటికి వచ్చిన కొన్ని గంటల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. తాము చెప్పిన ప్రదేశానికి రమ్మని చెప్పారు. నేను నా బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లాను. అక్కడ ఉన్న ఓ గదిలో బట్టలన్నీ చిందరవందరగాపడి ఉన్నాయి. ఓ అమ్మాయి స్పృహ లేకుండా నేలపై కనిపించింది. ఓ వ్యక్తి వచ్చి ఇతను ఎవరు? అని నా బాయ్ ఫ్రెండ్ గురించి అడగగా నా తమ్ముడని అబద్ధం చెప్పాను. ఎందుకో అక్కడి వాతవరణం తేడాగా అనిపించేసరికి వెంటనే అక్కడి నుంచి బయటపడ్డాం' అని క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని నటి రతన్ రాజ్‌పుత్ వెల్లడించింది.
కాగా రతన్ రాజ్‌పుత్ 'అగ్లే జనమ్ మోహే బితియా హై కిజో', 'మహాభారత్', 'సంతోషి మా' వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్ 7లో కూడా ఆమె పాల్గొంది. ఇప్పటికీ ఇలాంటి విషయాలు బయటపెట్టకపోతే ఎంతో మంది మోసపోయే అవకాశముందపి రతన్ పేర్కొంది.