
లోకేష్ చంపేస్తాడని త్రిష భయపడ్డారా? అతను చంపనందుకు హ్యాపీగా ఫీలవుతున్నారా? ఇప్పుడు నెట్టింట్లో ఇదో కొత్తరకం డిస్కషన్ జరుగుతోంది. ఉన్నట్టుండి ఇలాంటి డిస్కషన్ స్టార్ట్ కావడానికి రీజన్ లియో.

ఆల్రెడీ రజనీకాంత్ హీరోగా ఓ సినిమాను ఎనౌన్స్ చేసిన లోకేష్ త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. లియో విషయంలో వినిపించిన విమర్శలకు రజనీ మూవీతో లోకేష్ చెక్ పెడతారేమో చూడాలి.

త్రిష మాట్లాడుతూ ''లోకేష్ కనగరాజ్ యూనివర్శ్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. చాలా గర్వంగా అనిపిస్తోంది. లియోలో సత్య అనే కేరక్టర్ చేశాను. చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అది. ఈ సినిమా కమిట్ అయినప్పటి నుంచి లోకేష్ సత్య కేరక్టర్‌ని చంపేస్తారేమోననే అనుమానం ఉండేది. కానీ ఆయన అలా చేయనందుకు హ్యాపీగా ఉంది.

విజయ్‌తో పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లయింది. ఇన్నేళ్లల్లో నేను ఎక్కువ సమయం గడిపిన హీరో విజయ్. ఆయనతో కలిసి పనిచేస్తుంటే హై స్కూల్ క్లాస్‌మేట్‌ని మళ్లీ కలిసినంత రిఫ్రెషింగ్‌గా అనిపించింది'' అని అన్నారు.

డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయింది లియో. లోకేష్ రేంజ్ సినిమా కాదని కొందరన్నారు. అయితే కలెక్షన్లు మాత్రం దుమ్ముదులుపుతున్నాయి. నార్త్ లో పర్ఫెక్ట్ రిలీజ్ లేకపోయినా, వందల కోట్ల కలెక్షన్లు రావడం చూసి ఫిదా అవుతున్నారు దళపతి ఫ్యాన్స్. లియోకి సీక్వెల్ ఉంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

లోకేష్ కనగరాజ్ యూనివర్శ్‌లో చివరి సినిమా లియో అవుతుందనే టాక్ కూడా ఉంది. లియోలో మన్సూర్ అలీఖాన్ చెప్పిన ఫ్లాష్‌బ్యాక్ నిజమే కావాల్సిన పని లేదని లోకేష్ చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ లో అలా జరగకపోతే, మరెలా జరిగేదనే ఊహలు కూడా అప్పుడే మొదలయ్యాయి.