
ఎక్కడిదాకో ఎందుకు? మొన్న సంక్రాంతికి విడుదలైన హనుమాన్ ప్యాన్ ఇండియా రేంజ్‌లో సౌండ్ చేస్తోంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా కాసులు కొల్లగొట్టేస్తోంది. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సూపర్ హీరో చిత్రం.

అయితే, అదే సీజన్‌లో విడుదలైన ధనుష్ కెప్టెన్ మిల్లర్ మాత్రం అదర్ దేన్ తమిళనాడు సైలెంట్‌గా ఉండిపోయింది. నార్త్ దాకా ఎందుకు, పొంగల్ టైమ్‌లో తెలుగులోనే రిలీజ్‌కి నోచుకోలేదు కెప్టెన్ మిల్లర్. ఆ తర్వాత ఇక్కడ విడుదలైనా చడీ చప్పుడు చేయలేకపోయింది.

కూతురు కోసం రజనీకాంత్ నటించిన సినిమా లాల్ సలామ్. ఈ సినిమా మీద కెప్టెన్ ఐశ్వర్య మంచి హోప్స్ పెట్టుకున్నారు. తమిళ్‌తో పాటు మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు ఈ చిత్రాన్ని. కానీ ఎక్కడా సరైన ప్రమోషన్లు లేవు. సినిమాలో సూపర్‌స్టార్ ఉన్నప్పటికీ, మార్కెట్ చేసుకోవడంలో ఎక్కడో తడబడింది టీమ్.

రిలీజ్ అయిన సినిమాలకే కాదు, రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాల విషయంలోనూ ఇదే టాక్ వినిపిస్తోంది. సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువ. పలు రకాల గెటప్పుల్లో ఆయన చేస్తున్న ఈ సినిమాను వరల్డ్ వైడ్ థర్టీ ప్లస్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తామంటోంది టీమ్. అయినా, సౌత్ మార్కెట్లో కాస్తో కూస్తో వినిపిస్తున్న బజ్, నార్త్ సర్కిల్స్ లో ఎందుకు లేదన్నదే జనాల డిస్కషన్స్ లో ఉన్న టాపిక్.

సూర్య కంగువ మాత్రమే కాదు, విక్రమ్ సినిమా తంగలాన్‌కీ కష్టాలు తప్పడం లేదు. కేజీయఫ్ నేపథ్యంలో తెరకెక్కించారు ఈ సినిమాను. డబ్బింగ్ పూర్తయింది... అంటూ విక్రమ్ ఆ మధ్య హ్యాపీగా న్యూస్ షేర్ చేసుకున్నారు. చియాన్ డిఫరెంట్ గెటప్పుల్లో కనిపిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. గ్రౌండ్ లెవల్లో దిగి ప్రమోషన్లు చేయడానికి ఎప్పుడూ వెనకాడరు విక్రమ్. మరి తంగలాన్ విషయంలో ఆయన ప్లానింగ్ ఫలిస్తుందా? ప్యాన్ ఇండియా బజ్ క్రియేట్ అవుతుందా? అన్నది చూడాలి.