2024 Movies: నాని, నాగచైతన్య.. మీకు అక్కడేం పని.? టాలీవుడ్ లో ఎం జరుగుతుంది.?

| Edited By: Anil kumar poka

Apr 09, 2024 | 10:18 PM

ఎవరు ఏ సినిమాతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్‌ మీడియాలో మాత్రం ఏదో రకంగా యాక్టివ్‌గానే ఉంటారు. అభిమానులకు అందుబాటులోనే ఉంటారు. అందరికీ అత్యంత చేరువగా కనిపించే స్టార్‌ హీరోలు... ఇప్పుడు ఏ లొకేషన్‌లో ఏ సినిమా చేస్తున్నారు? ఈ సారి కొడితే బాక్సాఫీస్‌ షేక్‌ అయిపోవాలి... అనే కసి కనిపిస్తోంది మెగాస్టార్‌ చిరంజీవిలో. దానికి తగ్గట్టు సినిమా ప్రారంభానికి ముందు నుంచే కృషి చేయడం మొదలు పెట్టేశారాయన.

1 / 7
ఎవరు ఏ సినిమాతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్‌ మీడియాలో మాత్రం ఏదో రకంగా యాక్టివ్‌గానే ఉంటారు. అభిమానులకు అందుబాటులోనే ఉంటారు. అందరికీ అత్యంత చేరువగా కనిపించే స్టార్‌ హీరోలు... ఇప్పుడు ఏ లొకేషన్‌లో ఏ సినిమా చేస్తున్నారు?

2 / 7
ఈ సారి కొడితే బాక్సాఫీస్‌ షేక్‌ అయిపోవాలి... అనే కసి  కనిపిస్తోంది మెగాస్టార్‌ చిరంజీవిలో. దానికి తగ్గట్టు సినిమా ప్రారంభానికి ముందు నుంచే కృషి చేయడం మొదలు పెట్టేశారాయన.  వశిష్ట దర్శకత్వంలో  చిరంజీవి నటిస్తున్న విశ్వంభర షూటింగ్‌ ప్రస్తుతం ముచ్చింతల్‌లో జరుగుతోంది.

3 / 7
అక్కడికి కాస్త దూరంలో శంషాబాద్‌లో షూటింగ్‌ చేసుకుంటున్నారు ప్రభాస్‌. మారుతి డైరక్షన్‌లో ఆయన నటిస్తున్న రాజా సాబ్‌ చిత్రీకరణ అక్కడే జరుగుతోంది.

4 / 7
ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర పార్ట్ వన్‌. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు శంషాబాద్‌లో జరుగుతోంది. త్వరగా ఈ షూటింగ్‌ కంప్లీట్‌ చేసి వార్‌2 సెట్స్ కి వెళ్లాలన్నది తారక్‌ ప్లాన్‌. అక్టోబర్‌లో రిలీజ్‌ డేట్‌ మీట్‌ కావడానికి దేవర వర్క్ స్పీడ్‌గా చేస్తున్నారు కొరటాల.

5 / 7
బీహెచ్ఈల్‌లో రెండు సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. వాటిలో నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం ఒకటి కాగా,  నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్‌ మూవీ ఇంకోటి. సక్సెస్‌ ని కంటిన్యూ చేయాలని నాని, మంచి హిట్‌ కోసం నాగచైతన్య ఆన్‌ లొకేషన్‌లో బాగా కష్టపడుతున్నారు.

6 / 7
అజీజ్‌నగర్లోని గుంటూరు కారం సెట్లో నితిన్‌ హీరోగా నటిస్తున్న రాబిన్‌  హుడ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. మలేషియా టౌన్‌ షిప్‌లో శ్రీనువైట్ల డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారు గోపీచంద్‌.

7 / 7
రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా మిస్టర్‌ బచ్చన్‌. ఈ సినిమా షూటింగ్‌ లక్నోలోనే కంటిన్యూ అవుతోంది.మొన్నటివరకు దేవర షూటింగ్‌లో ఉన్న తారక్‌ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అక్కడ హృతిక్‌తో కలిసి వార్‌2 సెట్‌లో స్టెప్పులేస్తున్నారు.