
ఒక్క సెప్టెంబర్ ఎంత మంది కలలను మోసుకొస్తోందో తెలుసా? సమంత, నయనతార, అనుష్క, శ్రుతిహాసన్... ఇలా బ్యూటీస్ అందరూ సెప్టెంబర్ మీద చాలా చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆడియన్స్ ని పలకరించడానికి ఒక్కో వారం ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఆ డీటైల్స్ మాట్లాడుకుందాం... వచ్చేయండి.

అనుభవమే అంతా నేర్పుతుంది. జీవితాన్ని నేర్పించడానికి పాఠాలు రాసిన పుస్తకాలు ఎక్కడా దొరకవు అని ఇటీవల ఖుషి ప్రమోషన్లలో ఓపెన్ అయ్యారు సమంత. ఆమె ప్రస్తుతం షూటింగులకు కాస్త బ్రేక్ తీసుకున్నప్పటికీ, ఖుషి ప్రమోషన్లలో మాత్రం ఇంట్రస్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న విడుదలయ్యే ఖుషి సక్సెస్ సామ్‌కి చాలా ఇంపార్టెంట్.

కెరీర్ ప్రారంభించి ఇన్నేళ్లయినా, బాలీవుడ్ వైపు చూడలేదు నయనతార. సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్ అనే ఇమేజ్ ఉన్న ఈ బ్యూటీ నార్త్ లో ఫస్ట్ టైమ్ జవాన్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నారు. తన అభిమాన నటుడు షారుఖ్ తో కలిసి నయన్ చేసిన జవాన్ సక్సెస్ ఆమెకి చాలా ఇంపార్టెంట్.

రీఎంట్రీలో అనుష్క నటించిన సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా సక్సెస్ అనుష్కకి ఎంతో కీలకం. అందుకే సెప్టెంబర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు స్వీటీ. ట్రైలర్ చాలా బావుందంటూ ప్రభాస్ మెచ్చుకుంటే మురిసిపోయారు మిస్ స్వీటీ శెట్టి.

సామ్, నయన్, అనుష్క ఎలాగైనా హిట్ కొట్టాలని ట్రై చేస్తుంటే, ఆల్రెడీ ఈ ఏడాది రెండు హిట్లు చూసిన శ్రుతిహాసన్ మాత్రం హిట్‌ని కంటిన్యూ చేయడానికి తాపత్రయపడుతున్నారు.ప్రస్తుతం సలార్ మూవీకి అన్నీ భాషల్లోనూ ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నారు శ్రుతిహాసన్. ఈ సినిమా సక్సెస్ అయితే 2023లో హ్యాట్రిక్ కొట్టినట్టే మన సిల్వర్ స్క్రీన్ సుగుణసుందరి.