
నెక్ట్స్ ఫాంటసీ మూవీ: ఏజెంట్ సినిమాతో నిరాశపరిచిన అఖిల్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యంగ్ హీరో నెక్ట్స్ మూవీ ఫాంటసీ డ్రామాగా రూపొందనుంది. అనిల్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ యూవీక్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

హనుమాన్ భక్తుడిగా: ప్రస్తుతం స్వయంభూ షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ హీరో నిఖిల్ ఆ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఫోక్‌లోర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో తాను హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నట్టుగా వెల్లడించారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

న్యూ లుక్ : డంకీ రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న షారూఖ్ ఖాన్, నెక్ట్స్ మూవీ కోసం మేకోవర్ అవుతున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. కూతురు సుహానాతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారు బాద్‌షా.

ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆ లుక్ రివీల్ కాకుండా ఉండేందుకు మీడియా కెమెరాలకు ముఖం కనిపించకుండా ఉండేలా చూసుకుంటున్నారు.

అవన్నీ రూమర్స్: నితిష్ తివారీ రామయణంలో బాబీ డియోల్ నటిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ రూమర్స్ అని, బాబీకి రామయాణం టీమ్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చింది. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ డియోల్, తెలుగులో బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సెకండ్ ట్రైలర్: దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ 'మై అటల్ హూ'. రవి జాదవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి టైటిల్ రోల్‌లో నటించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెకండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.