
టాలీవుడ్‌లో రిపీట్ కాంబినేషన్స్‌కు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ముందు సినిమా హిట్ ఫ్లాపులతో పనిలేకుండా దర్శకులను మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నారు హీరోలు. కథ నచ్చితే.. ట్రాక్ రికార్డ్ చూడకుండా ఛాన్సిచ్చేస్తున్నారు. తాజాగా మరో కాంబినేషన్ కూడా రిపీట్ కాబోతుంది.. మరి అదేంటి..? అసల ఎవరు ఎవరితో సినిమాలు చేస్తున్నారు..?

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేయడం మాత్రమే రవితేజకు తెలిసిన పని. ఇప్పుడూ ఇదే చేస్తున్నారీయన. ప్రస్తుతం హరీష్ శంకర్‌తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నారు. మిరపకాయ్ వచ్చిన 13 ఏళ్ళకు ఈ కాంబో రిపీట్ అవుతుంది. అలాగే గోపీచంద్ మలినేనితోనూ మరో సినిమాకు సిద్ధమవుతున్నారు మాస్ రాజా.

2024లో సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్ సందడి సో సోగా కనిపించింది. సమ్మర్ అయితే పూర్తిగా వేస్ట్ అయిపోయింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దసరా, దీపావళి సీజన్ల మీద పడింది. మరి ఆ సీజన్లో అయినా సిల్వర్ స్క్రీన్ మీద సందడి కనిపిస్తుందేమో చూడాలి.

మరోవైపు నాని ఎక్కువగా రిపీట్ కాంబినేషన్స్‌కే ఓటేస్తున్నారు. సెట్స్‌పై ఉన్న సరిపోదా శనివారం సినిమాకు అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకుడు. గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్.

అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనూ సినిమా ప్రకటించారు నాని. ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. ఇక అల్లు అర్జున్‌తో త్వరలోనే 4వ సినిమా చేయబోతున్నారు గురూజీ. బోయపాటి, బాలయ్య సైతం 4వ సారి కలిసి పని చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ కూడా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్‌తో సినిమా చేయబోతున్నారు.