Tollywood News: వరుస షూటింగులతో కళకళలాడుతున్న భాగ్యనగరం

| Edited By: Phani CH

Aug 22, 2024 | 7:32 PM

పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా షూటింగులను పూర్తి చేసి తీరాలనే డెడికేషన్‌తో పనిచేస్తున్నారు మన స్టార్‌ హీరోలు. చాలా వరకు హైదరాబాద్‌ పరిసరాల్లోనే షూటింగులు చేసేస్తున్నారు. ఇంతకీ పోయిన వారం వెళ్లిన లొకేషన్లకి ఎంత మంది వెళ్తున్నారు.. కొత్త ప్లేస్‌లను ఎవరు ఎక్స్ ప్లోర్‌ చేస్తున్నారు.! మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్ లో షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

1 / 5
పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా షూటింగులను పూర్తి చేసి తీరాలనే డెడికేషన్‌తో పనిచేస్తున్నారు మన స్టార్‌ హీరోలు. చాలా వరకు హైదరాబాద్‌ పరిసరాల్లోనే షూటింగులు చేసేస్తున్నారు. ఇంతకీ పోయిన వారం వెళ్లిన లొకేషన్లకి ఎంత మంది వెళ్తున్నారు.. కొత్త ప్లేస్‌లను ఎవరు ఎక్స్ ప్లోర్‌ చేస్తున్నారు.!

2 / 5
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్ లో షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ని పూర్తి చేసి సంక్రాంతికి ప్రేక్షకులకు గ్రాండ్‌ ట్రీట్‌ ఇవ్వాలనే ఇంటెన్షన్‌తో పనిచేస్తున్నారు వశిష్ట. అంతే వేగంగా షూటింగ్‌ జరుపకుంటోంది రాజా సాబ్‌. శంషాబాద్‌ పరిసరాల్లో సేమ్‌ లొకేషన్‌లోనే తెరకెక్కిస్తున్నారు మారుతి.

3 / 5
రవితేజ హీరోగా భాను బొగ్గవరపు దర్శజకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ వెస్ట్ మారేడుపల్లిలో జరుగుతోంది. నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వెస్ట్ మారేడుపల్లిలో షూటింగ్‌లో ఉంది. పుష్ప 2 సినిమాను ఎలాగైనా డిసెంబర్‌ 6న విడుదల చేయాలనే పట్టుదలతో పనిచేస్తోంది టీమ్‌. రామోజీ ఫిల్మ్ సిటీలో లాస్ట్ లెగ్‌ షూటింగ్‌ జరుగుతోంది.

4 / 5
సన్నీడియోల్‌ ప్రధాన పాత్రలో మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ అల్యూమినియమ్‌ ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న మూవీ షూటింగ్‌ కూడా అల్యూమినియమ్‌ ఫ్యాక్టరీలో శరవేగంగా జరుగుతోంది.

5 / 5
వెంకటేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ పొల్లాచ్చిలో జరుగుతోంది. 2025 సంక్రాంతి మా వంతు ఫన్‌ పంచడం పక్కా అనే గ్యారంటీ ఇస్తున్నారు అనిల్‌ రావిపూడి.