
సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారు మన హీరోలు. రామ్‌నే తీసుకోండి.. కొన్నేళ్లుగా ఈయన ఫుల్ మాస్ అవతారంలోనే ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ అంటూ గడ్డం తీయలేదసలు.

కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం లవర్ బాయ్‌లా మారిపోయారు. దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ మళ్లీ క్లాస్ సినిమా చేస్తున్నారు.

అఖిల్ కూడా నెక్ట్స్ సినిమా కోసం బీస్ట్‌గా మారిపోతున్నారు. కండలు పెంచేసి హల్క్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. యువీ క్రియేషన్స్‌లో ఓ భారీ సినిమాతో పాటు.. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరుతో ఓ సినిమా చేస్తున్నారీయన. ఈ రెండూ డిఫెరెంట్‌గానే ఉండబోతున్నాయి.

అలాగే సంబరాల యేటిగట్టు కోసం సాయి ధరమ్ తేజ్ మేకోవర్ పిచ్చెక్కిస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు మారిపోతున్నారు. లైగర్ కోసం బీస్ట్ మోడ్‌లోకి వచ్చిన ఈయన.. ఖుషీ, ఫ్యామిలీ స్టార్‌లలో రొమాంటిక్‌గా కనిపించారు.

ఇప్పుడు కింగ్‌డమ్ కోసం గుండుతో రఫ్ లుక్‌లో మారిపోయారు. నెక్ట్స్ రాహుల్ సంక్రీత్యన్ సినిమా కోసం మరోలా కనిపించబోతున్నారు. ఇక నిఖిల్ స్వయంభు, ది ఇండియా హౌజ్ కోసం భారీగా మేకోవర్ అయ్యారు.