ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ ఫిల్మ్ మేకర్ అయినా మీడియా ముందుకు వచ్చేది తమ సినిమా గురించి ప్రమోషన్ చేసుకుందామని... ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న ఆ సినిమాను కాదని, ఇంకేదో టాపిక్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఎక్కడికెళ్లినా సొంత టాపిక్ కాకుండా, ఇంకేదో టాపిక్ మీద మాట్లాడటమే అవుతోంది కొందరికి.. ఇంతకీ ఇలాంటి ఇష్టమైన ఇబ్బందిని ఫేస్ చేస్తున్న సెలబ్రిటీలు ఎవరో చూసేద్దాం రండి...
మరి ఇప్పుడు దాన్ని తలదన్నేలా సుకుమాస్టర్ ప్లాన్ చేస్తున్నారా? ఈసారి స్పెషల్ భామగా ఎవరిని ఫిక్స్ చేశారు అనే టాపిక్ మీద క్యూరియాసిటీ తెగ పెరిగిపోతోంది జనాలకు.
భారీ సినిమాలతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికీ ఇలాంటి సిట్చువేషనే ఎదురవుతోంది. ఆ మధ్య డెవిల్ సినిమా ప్రమోషన్ల కోసం కల్యాణ్‌రామ్ మీడియా ముందుకు వస్తే, అందరూ దేవర గురించి డీటైల్స్ ఏమైనా చెబుతారేమోననే ఎక్కువగా ఎదురుచూశారు. కొంచెం డెవిల్, కొంచెం దేవర అన్నట్టు మాట్లాడాల్సి వచ్చింది కల్యాణ్‌రామ్‌కి.
అప్పుడెప్పుడో డెవిల్ రిలీజులో కల్యాణ్ రామ్ మాత్రమే కాదు, రీసెంట్‌గా భారతీయుడు 2 ప్రమోషన్లలో శంకర్ కూడా సేమ్ ఇబ్బందిని ఫేస్ చేశారు. మిగిలిన చోట్ల ఆయన ఇండియన్2 ప్రమోషన్లు భేషుగ్గా జరిగినా... తెలుగునాట మాత్రం శంకర్ కనిపించిన ప్రతిసారీ గేమ్ చేంజర్ డీటైల్సే కావాలనుకునేవారు అభిమానులు.
శంకర్‌కి మాత్రమే కాదు, దిల్‌రాజుకు కూడా గేమ్‌చేంజర్ క్వయరీలు తప్పలేదు. సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది? ఇంకెన్నాళ్లు చిత్రీకరిస్తారు? ఎప్పుడు విడుదల చేస్తారు? సినిమా ఎలా వస్తోంది? అంటూ రకరకాల ప్రశ్నలకు ఓపిగ్గానే సమాధానాలిచ్చారు దిల్‌రాజు. క్రిస్మస్‌కి రావడం పక్కా అని ఆయన చెప్పిన స్టేజ్ కూడా సొంత స్టేజ్ కాదు. ఇంకో మూవీ కి ఛీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడే చెప్పారు దిల్‌రాజు.