
సమ్మర్‌లో పెద్ద సినిమాలేవీ విడుదల కావట్లేదు కానీ షూటింగ్స్ కళ మాత్రం బాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలందరూ సెట్స్‌లోనే ఉన్నారు.. ఒకరిద్దరు మినహా. పవన్ ఇంకా కొన్నాళ్లు పాలిటిక్స్‌తోనే బిజీగా ఉండేలా కనిపిస్తున్నారు.

విశ్వంభరలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు బాస్..? మామూలు మెగా అభిమానికే కాదు.. కామన్ ఆడియన్స్ మనసులోనూ ఇదే అనుమానం వస్తుందిప్పుడు. ఎందుకంటే రోజుకో హీరోయిన్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నా అంటున్నారు.

అలాగే ఈ చిత్రం భారీ సెట్ కూడా చేసారు. ఇక ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ షూటింగ్ శంషాబాద్‌లో.. నాగ్ అశ్విన్‌తో చేస్తున్న కల్కి షూటింగ్ శంకరపల్లిలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కొన్ని రోజులుగా RFCలోనే జరుగుతుంది.

ఓజీ, హరిహర వీరమల్లు ప్రోగ్రెస్‌ని బట్టి, ఉస్తాద్ భగత్‌సింగ్‌లో కదలికలు ఉంటాయి. భగవంత్ కేసరి సక్సెస్ చూశాక, కె.ఎస్.రవీంద్ర సెట్స్ కి షిఫ్ట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ.

నాగ చైతన్య తండేల్ చిత్ర షూటింగ్ BHELలో జరుగుతుంది. మంచు విష్ణు కన్నప్ప షూటింగ్ RFCలో జరుగుతుండగా.. శర్వానంద్, అభిలాష్ కంకర సినిమా షూటింగ్ శంషాబాద్‌లో.. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్ పఠాన్ చెరు సమీపంలో.. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతున్నాయి.