Sankranthi 2025: ఇంకా షూటింగ్స్ మొదలవ్వలేదు.. కానీ సంక్రాంతికి వస్తున్నాం..

Edited By: Prudvi Battula

Updated on: Mar 18, 2024 | 10:38 AM

ఆలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అంటూ తెలుగులో మంచి సామెత ఒకటుంది కదా..? అనౌన్స్‌మెంట్స్ రాలేదు.. షూటింగ్స్ మొదలవ్వలేదు.. కానీ అప్పుడే సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు. మరింతకీ అందులో అనుకున్న టైమ్‌కు వచ్చే సినిమాలేవి..? అసలు 2025 సంక్రాంతి రేసులో ఎన్ని సినిమాలున్నాయి..? మొన్నటి సంక్రాంతి అయిపోయే ఇంకా రెండు నెలలు కాలేదు కానీ అప్పుడే 2025 సంక్రాంతి గురించి అరడజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి.

1 / 5
చిరంజీవి హీరోగా నటిస్తున్న  విశ్వంభర షూటింగ్ మొదలైంది. జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది మినహా పండక్కి వస్తామని చెప్తున్న ఏ సినిమా షూటింగ్ కాదు కదా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ కూడా రాలేదు. చిరంజీవి అనుకున్నట్లుగానే జనవరి 10న వచ్చేలా ఉన్నారు. సెప్టెంబర్‌లోపే విశ్వంభర షూట్ పూర్తి కానుంది.

2 / 5
మరోవైపు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజా సాబ్ షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తైంది. కల్కి షూటింగ్ కంప్లీట్ అయినా తర్వాత దీనిపై ఫోకస్ చేయనున్నారు డార్లింగ్. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది  పండక్కి రావడం ఖాయంగానే కనిపిస్తుంది. చిరంజీవి, ప్రభాస్ కాకుండా మిగిలిన హీరోలందరికీ పండక్కి వచ్చే ఛాన్స్ ఉందా అంటే సమాధానం చెప్పడం కూడా కష్టమే. 

3 / 5
కానీ వెంకటేష్, నాగార్జున ఇంకా సినిమా అనౌన్స్ చేయకుండానే.. బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు, నా సామిరంగా విజయాలతో నాగార్జునకు సంక్రాంతి కలిసొచ్చింది. అందుకే 2025 సంక్రాంతికి వచ్చేస్తానంటున్నారీయన. బంగార్రాజు 2ను ఆగస్ట్ తర్వాత మొదలు పెట్టి.. పండక్కి విడుదల చేయాలని చూస్తున్నారు. 

4 / 5
మరోవైపు వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాకు సంక్రాంతికి కలుద్దాం అనే టైటిలే ఫిక్స్ చేసారు. అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు అప్పుడొచ్చి దుమ్ము దులిపేసాయి. అందుకే వెంకటేష్ సినిమాను ఎలక్షన్స్ తర్వాత మొదలుపెట్టి.. పండక్కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు.

5 / 5
ఇక శతమానం భవతి 2 సైతం సంక్రాంతి 2025కి వస్తుందని ఖరారు చేసారు దిల్ రాజు. 2017లో వచ్చిన శతమానం భవతికి సీక్వెల్ ఇది. శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత గానీ శతమానం భవతి 2 వైపు రాడు. ఈ లెక్కన పండక్కి శతమానం భవతి 2 రావడం చాలా కష్టం. 