5 / 5
తాజాగా పుష్ప 2తో బాలీవుడ్ రికార్డ్స్ తిరగరాస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియన్ సినిమాల్లో తెలుగు దర్శకులకు ఉన్న సక్సెస్ రేట్ ఇంకెవరికీ లేదు. తమిళం నుంచి కంగువా, తంగలాన్, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాలు వచ్చినా.. పాన్ ఇండియన్ కాలేకపోయాయి. ఉన్నంతలో కన్నడ కాస్త బెటర్. ఎలా చూసుకున్నా.. పాన్ ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదైతే మన తెలుగు ఇండస్ట్రీనే.