
వారు బద్ధ శత్రువులుగా మారిన స్టోరీతో సెకండ్ పార్ట్ శౌర్యాంగపర్వం సిద్ధమవుతోంది. డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా కొబ్బరికాయ కొట్టేశారు మేకర్స్. సలార్2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.

సలార్ సినిమా డేట్ పోస్ట్ పోన్ అయినప్పుడు అర్జంటుగా ఆ డేట్‌ని కబ్జా చేసింది స్కంద సినిమా. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ రామ్, మాస్‌కి కేరాఫ్ బోయపాటి కలిసి చేసిన సినిమా కావడంతో స్కంద మీద అప్పట్లో మామూలు అంచనాలు లేవు. కానీ, దమ్మున్న కంటెంట్ సినిమాలో లేకపోవడంతో థియేటర్లలో చతికిలబడింది సినిమా.

దేవర వస్తుందని అనుకున్న సమ్మర్ సీజన్‌లో ఫ్యామిలీస్టార్ ప్రెజెన్స్ కనిపించింది. ఖుషీ సినిమా సక్సెస్‌లో ఉన్న విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రీ రిలీజ్‌లో ఉన్న హైప్ కాస్తా.. ఆఫ్టర్ రిలీజ్ డివైడ్ టాక్‌గా మారింది.

లేటెస్ట్ గా పుష్ప ఆగస్టు 15 నుంచి అటు జరిగీ జరగగానే... మేం వస్తున్నామని ప్రకటించారు పూరి జగన్నాథ్ అండ్ హరీష్ శంకర్. అర్జంట్ అర్జంటుగా ఆ డేట్‌ని బుక్ చేసుకున్న రెండు సినిమాలకూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కనిపిస్తోంది.

హాలీవుడ్ స్టేజ్‌లోనే తమ దేవరను పరిచయం చేయాలని చూస్తున్నారు తారక్ అండ్ టీం. గతంలో RRRతో ఎలాగూ అక్కడి ప్రేక్షకులకు కాస్తో కూస్తో చేరువయ్యారు ఎన్టీఆర్. ఆ గుర్తింపును ఇప్పుడు దేవరతో డబుల్ చేసుకోవాలని చూస్తున్నారు.