AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathi Babu: 60 దాటినా ఏ మాత్రం తగ్గని ఎనర్జి.. జగపతి బాబు డైట్ ప్లాన్ ఇదే

అరవై ఏళ్లు దాటినా యంగ్‌గా, ఫిట్‌గా కనిపించే జగపతి బాబు తన ఆరోగ్య రహస్యాలను అభిమానులతో పంచుకున్నారు. రోజూ గంటసేపు వాకింగ్, బెండకాయ జ్యూస్, పండ్లతో కూడిన బ్రేక్‌ఫాస్ట్, మజ్జిగతో చద్ది అన్నం, క్రమం తప్పని జిమ్ వర్కౌట్ తన ఫిట్‌నెస్‌కు కారణమని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని సూచించారు.

Phani CH
|

Updated on: Jun 05, 2026 | 7:00 PM

Share
టాలీవుడ్ సీనియర్ హీరో, ప్రముఖ విలక్షణ నటుడు జగపతి బాబు స్క్రీన్ మీద కనిపిస్తే ఆ గ్రేస్, స్టైల్ వేరుగా ఉంటుంది. వయసు అరవై దాటినా కూడా ఆయన ఎంతో ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తూ నేటితరం నటులకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే, ఆయన ఈ వయసులో కూడా ఇంత ఎనర్జిటిక్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి వెనుక ఉన్న రహస్యం ఏంటా అని చాలా మంది అభిమానులకు సందేహం ఉంటుంది. తాజాగా జగపతి బాబు గారు స్వయంగా తన ఉదయపు దినచర్య (Morning Routine) మరియు డైట్ ప్లాన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

1 / 5
జగపతి బాబు గారి ఉదయం షెడ్యూల్ ప్రతిరోజూ వాకింగ్‌తో ప్రారంభమవుతుంది. ఆయన రోజుకు కనీసం ఒక గంట పాటు వాకింగ్ చేస్తారు. ఈ వన్ అవర్ వాకింగ్‌లో సుమారుగా 7000 స్టెప్స్ పూర్తి చేయడం ఆయన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా, తాను నిజంగానే ఈ అలవాట్లను పాటిస్తున్నానని చూపిస్తూ ఆయన తన మార్నింగ్ డైట్ మొత్తాన్ని అభిమానుల కోసం వివరించారు.

2 / 5
వాకింగ్ పూర్తయిన తర్వాత ఆయన తీసుకునే మొదటి డ్రింక్ చాలా ప్రత్యేకం. అదేంటంటే, ‘బెండకాయ జ్యూస్’. కేవలం బెండకాయలతో మాత్రమే తయారు చేసిన ఈ జిగురుగా ఉండే జ్యూస్‌ను ఆయన ప్రతిరోజూ ఉదయాన్నే తాగుతారు. బెండకాయ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతుంటారు.

3 / 5
ఈ హెల్తీ జ్యూస్ తాగిన తర్వాత జగపతి బాబు గారు తన ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌గా తాజా పండ్లను తీసుకుంటారు. ఇందులో భాగంగా బొప్పాయి, ఆపిల్, మరియు కీరదోస ముక్కలను తింటారు.  అయితే, కార్బోహైడ్రేట్లు మరియు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే కొన్ని రకాల పండ్లను మాత్రం ఆయన పూర్తిగా దూరం పెడతారు. అతిగా తింటే షుగర్ పెరుగుతుందనే ఉద్దేశంతో డైట్‌లో కచ్చితమైన నియమాలు పాటిస్తారు. ఆ తర్వాత చద్ది అన్నం ప్రత్యకంగా ఓ కుండలో మజ్జిగతో కలిపి తీసుకుంటారట. మజ్జిగ చద్ది అన్నం తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

4 / 5
ఈ బ్రేక్‌ఫాస్ట్ అంతా ముగిసిన తర్వాత ఆయన జిమ్ వర్కౌట్స్ చేయడానికి వెళ్తారు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఏదో ఒక శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ చేసినా, చేయకపోయినా సరే, రోజువారీ వర్కౌట్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదని ఆయన గట్టిగా చెబుతారు. క్రమశిక్షణతో కూడిన ఈ ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామమే జగపతి బాబు గారి అద్భుతమైన ఫిట్‌నెస్‌కు అసలైన కారణం.

5 / 5
Follow Us