1 / 5
36 ఏళ్ల తరువాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన బజ్ సోషల్ మీడియను షేక్ చేస్తోంది. తాజాగా టైటిల్ ఎనౌన్స్ చేసిన మేకర్స్, సినిమా మీద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు. అదే సమయంలో కొత్త డౌట్స్ కూడా రెయిజ్ చేశారు. లేటెస్ట్ టీజర్‌లో కమల్‌ను ఓ గ్యాంగ్‌స్టర్‌లా పరిచయం చేశారు. అదే సమయంలో కమల్ క్యారెక్టర్ పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్ అని చూపించారు.