జయ సుధ, సభాషిణి : మెగాస్టార్ చిరంజీవి సీనియర్ నటి జయ సుధతో అనేక సినిమాల్లో నటించారు. ప్రాణం ఖరీదు, మగధీరుడు వంటి సినిమాల్లో వీరు కలిసి నటించారు. అదేవిధంగా జయ సుధ చెల్లి సుభాషిణితో కూడా చిరు స్టెప్పులేశారు. వీరిద్దరి కాంబోలో ఆరటని మంటలు సినిమా వచ్చింది.
రాధ, అంభిక : చిరు సీనియర్ స్టార్ బ్యూటీ రాధికతో నాగు, దొంగ, ప్రాణం, పులి, రక్త సింధూరం, అడవి దొంగ వంటి అనేక సినిమాలు చేశారు. అదే విధంగా రాధ చెల్లి అంభికతో ఈ హీరో యముడికి మెగుడు సినిమాలో ఆడిపాడారు. ఇలా ఇద్దరు అక్క చెల్లెల్లతో ఈ హీరో రొమాన్స్ చేశారు. , Ambika
రాధిక, నిరోషి: రాధిక చిరంజీవిలది ఆ రోజుల్లో తిరుగులేని పెయిర్. వీరి కాంబోలో న్యాయం కావాలి, దొంగ మొగుడు వంటి అనేక సినిమాలు వచ్చాయి. అయితే చిరు రాధిక సిస్టర్ నిరోషాతో స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాలో కలిసి నటించారు.
జ్యోతిక, నగ్మా: సీనియర్ హీరోయిన నగ్మా చిరంజీవితో కలిసి ఘరానా మొగుడు, వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అదే విధంగా ఈ బ్యూటీ చెల్లి జ్యోతిక కూడా చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్‌లో చిరుతో స్టెప్పులేసింది.
సుహాసిని, శృతి హాసన్ : సీనియర్ హీరోయిన్ సుహాసిని, చిరంజీవి కాంబినేషన్‌లో ఆరాధన. గురువుకు తగ్గ శిశ్యులు, చంటబ్బాయి దొరికేసాడు, కిరాతకుడు వంటి అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఈ నటి కజిన్ శృతిహాసన్. వీరిద్దరు అక్కా చెల్లెల్లు అవుతారు. అలా శృతిహాసన్‌తో చిరు వాల్తేరు వీరయ్యలో నటించిన విషయం తెలిసిందే.