
బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ తన క్యూట్ నెస్, అందం, నటనతో ఎంతో మంది మదిని దోచుకుంది. టాలీవుడ్‌లో వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకొని సత్తా స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. కాగా, బ్యూటీ తన కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో కొన్ని సినిమాలు రిజక్ట్ చేసింది. దీంతో ఈబ్యూటీకి ఫ్లాప్స్ అనేవే లేకుండా పోయాయి. మరి ఈ ముద్దుగుమ్మ రిజక్ట్ చేసిన ఆ ఫ్లాప్ మూవీస్ ఏవో చూద్దాం పదండి.

అలాగే డిజాస్టర్ మూవీస్‌లలో విక్రమ్ ఐ మూవీ కూడా ఒకటి. ఈ మూవీలో అమీర్ జాక్సిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కాగా, సినిమాలో మొదటగా హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలి అనుకున్నారంట, కానీ పలు కారణాల వలన ఈ బ్యూటీ ఐ మూవీని రిజక్ట్ చేసిందంట.

అలాగే నాని నిన్ను కోరి మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక నాని, సమంత కాంబోలో వచ్చిన చాలా సినిమాలో మంచి హిట్ అందుకున్నాయి. అయితే అలానే నిన్ను కోరి మూవీలో కూడా నాని సరసన సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేశారంట. కానీ తాను బిజీగా ఉండటం వలన సామ్ ఈ మూవీని రిజక్ట్ చేసినట్లు సమాచారం.

అదే విధంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా ఎవడు. ఇందులో శృతి హాసన్, కాజల్ హీరోయిన్స్‌గా నటించారు. అయితే ఈ మూవీలో సమంతకు అవకాశం వచ్చిందంట, శృతి హాసన్ స్థానంలో సమంత నటించాల్సి ఉండేదంట. కానీ తనకు అనారోగ్య సమస్యలు ఉండటంతో సమంత ఈ మూవీని రిజక్ట్ చేసి, ఫ్లాప్ నుంచి తప్పించుకుంది.

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబోలో వచ్చిన బ్రూస్ లీ మూవీ రిలీజై డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా మొదటగా, సమంతను అనుకున్నారంట మూవీటీం. దీంతో సమంతను సంప్రదించగా, సమంతకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో, ఈ మూవీని రిజక్ట్ చేసిందంట. అలా సమంత ఫ్లాప్ మూవీ నుంచి బయటపడిందంట.