సక్సెస్ ఫుల్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ బ్యూటీ సిస్టర్‌గా నిషా అగర్వాల్ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సక్సెస్ అందుకోలేకపోయింది.
ఒకప్పుడు తన గ్లామర్‌తో టాలీవుడ్‌నే షేక్ చేసిన హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ ఒకరు. ఆమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తన చెల్లి నిధి అగర్వాల్ గంగోత్రి సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చినా అంతగా పాపులర్ కాలేకపోయింది.
నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ముద్దుగుమ్మ చెల్లెలు పరిణీతి చోప్రా కూడా బాలీవుడ్ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. కానీ తన అక్కలా అంత ఫేమ్ సొంత చేసుకోలేకపోయింది.
శృతి హాసన్ ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకెళ్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటతో సత్తాచాటింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ బ్యూటీ సిస్టర్ అక్షర హాసన్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మంచి ఫేమ్ తెచ్చుకోలేకపోయింది.
అదే విధంగా సాగరకన్య సినిమాతో మంచి ఫేమ్ తెచ్చున్న ముద్దుగుమ్మ శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అంతగా క్రేజ్ సంపాదించుకోలేదు.